అక్షరటుడే, వెబ్డెస్క్ : Anti Drone System | పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో భారత్–పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రెండు దేశాల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.
సరిహద్దుల్లో boarder ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించాయి. మరోవైపు పాకిస్తాన్ నిత్యం కాల్పులకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం punjab govt కీలక నిర్ణయం తీసుకుంది.
పాకిస్తాన్ సరిహద్దుల్లో border యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాక్ వైపు నుంచి ఏమైనా డ్రోన్లు వస్తే వాటిని ఈ వ్యవస్థ ద్వారా కూల్చివేయవచ్చు.