ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Jeevan Reddy | రాష్ట్రాన్ని ముంచేందుకే​ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

    Jeevan Reddy | రాష్ట్రాన్ని ముంచేందుకే​ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

    Published on

    అక్షరటుడే,ఇందూరు: Jeevan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముంచే ప్రభుత్వంగా తయారైందని బీఆర్ఎస్ (Nizamabad BRS)  జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం (KCR) రూ.2.80 లక్షల కోట్లు అప్పు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల్లో రూ.2.20 లక్షల వేల కోట్లు అప్పు చేసిందని జీవన్​రెడ్డి తెలిపారు. ఈ లెక్కలు పార్లమెంట్​ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అందించినవేనని ఆయన స్పష్టం చేశారు.

    సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy), మంత్రులు పొంతన లేకుండా రూ.8 లక్షల వేల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ చేసిన అప్పులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు.

    మిషన్ కాకతీయ (Mission Kakatiya), రైతుబంధు (Rythu Bandhu), రైతు బీమా (Rythu Bima) లాంటి పథకాలు ప్రవేశపెట్టారని జీవన్​రెడ్డి వివరించారు. 24 గంటల విద్యుత్​, మెడికల్ కళాశాలలు (medical colleges), నూతన కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు (SP Office), కాళేశ్వరం (Kaleshwaram), యాదాద్రి ఆలయ నిర్మాణం ఇలా ఎన్నో పనులు కేసీఆర్​ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల్లో చేసిన అప్పులతో ఏం చేశారని ప్రశ్నించారు.

    రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. అంతా అల్లకల్లోలంగా మారిందని, యూరియా కొరత కూడా విపరీతంగా ఉందన్నారు. మహాలక్ష్మి పథకం, నిరుద్యోగ భృతి, బతుకమ్మ చీరలు, పింఛన్ పెంపు, కేసీఆర్ కిట్​ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ అవినీతిని గ్రామ గ్రామాన చేరవేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

    Jeevan Reddy | జిల్లాకు మంత్రి లేడు..

    జిల్లాలో గొప్ప నాయకులు ఉన్న చరిత్ర ఉందని, కానీ ఇప్పటికీ మంత్రి పదవి ఇవ్వకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉన్నా జిల్లాకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy), షబ్బీర్ అలీ (Shabbir Ali) ఉన్నా కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం అగౌరవపర్చడమేనన్నారు.

    జిల్లా సమస్యలను ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలో 35 వేల కుటుంబాలకు రుణమాఫీ కాలేదని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని తెలిపారు. సమావేశంలో నాయకులు ప్రభాకర్, సుజీత్ సింగ్ ఠాగూర్, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 16 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Rajagopal Reddy | మరోసారి సీఎం రేవంత్​ను టార్గెట్ చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్!

    అక్షరటుడే, హైదరాబాద్: Rajagopal Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్...

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...

    alcohol with volcanic ash | అగ్నిపర్వతాల బూడిదతో మద్యం తయారీ.. తాగారా దీనిని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: alcohol with volcanic ash : అంతర్జాతీయ బ్రాండ్​ ఆల్కహాల్​ (international brand alcohol) కోసం...

    More like this

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 16 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Rajagopal Reddy | మరోసారి సీఎం రేవంత్​ను టార్గెట్ చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్!

    అక్షరటుడే, హైదరాబాద్: Rajagopal Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్...

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...