అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kodandaram | గవర్నర్ కోటాలో ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోదండరాం(Kodandaram), అమీర్ అలీ ఖాన్(Aamir Ali Khan) ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. వీరిద్దరూ గవర్నర్ కోటా(Governor Quota)లో ఎన్నికైన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు తాజా వారిని నియామకాన్ని రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. తాజా నామినేషన్లు తమ తుది గడువు తీర్పుకు లోబడే ఉంటాయని న్యాయస్థానం పేర్కొంది.
Kodandaram | హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ..
గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. కాగా.. వీరికి రాజకీయ నేపథ్యం ఉందంటూ నాటి గవర్నర్ ప్రతిపాదనలను తిరస్కరించారు. దీంతో వారు హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం వీరిద్దరు గతేడాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ నియామకాన్ని పక్కన పెట్టి, కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాల్ చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరగా.. గవర్నర్ నామినేట్(Governor Nomination) చేయడాన్ని అడ్డుకోలేమని ధర్మాసనం నిరాకరించింది. అయితే కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా.. పూర్తిస్థాయి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు(Supreme Court) కోదండరాం, అలీఖాన్ల నియామకాన్ని రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది.