ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNasha Mukt Bharat Abhiyaan | మాదకద్రవ్యాల వ్యతిరేకంగా విద్యార్థుల ప్రతిజ్ఞ

    Nasha Mukt Bharat Abhiyaan | మాదకద్రవ్యాల వ్యతిరేకంగా విద్యార్థుల ప్రతిజ్ఞ

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nasha Mukt Bharat Abhiyaan | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College) విద్యార్థులు, సిబ్బంది మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. నషా ముక్త్ భారత్ (Nasha Mukth Bharath) కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్య కమిషనర్ (College Education) ఆదేశాల మేరకు బుధవారం కళాశాల విద్యార్థుల చేత మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.

    తాము మాదకద్రవ్యాల (Narcotics) జోలికి వెళ్లమని, తమ పరిసరాల్లో మాదకద్రవ్యాల వినియోగం జరిగితే పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

    ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్రకాంత్, కళాశాల మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమన్వయకర్త డాక్టర్ శంకరయ్య, అధ్యాపకులు జె శివకుమార్, అమరేశం ప్రభాకర్ రావు, డాక్టర్ అరుణ్ కుమార్, చంద్రకాంత్, కృష్ణ ప్రసాద్, రాణి, సంతోష్, డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దు రాజు, మహమూద్, మోయిన్, స్వప్న, సురేష్ రెడ్డి, రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    Nasha Mukt Bharat Abhiyaan | మాదక ద్రవ్యాలతో జీవితం నాశనమవుతుంది

    అక్షరటుడే, బాన్సువాడ: మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయని, వాటి వ్యసనం కుటుంబం, ఆరోగ్యం, భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందని ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్ గులాం ముస్తఫా అన్నారు. బాన్సువాడ ఎస్ఆర్ఎన్​కే (SRNK) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ యూనిట్-1,-3 ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

    విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఇతరులకు దూరంగా ఉంచేందుకు ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వినియోగం పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ భగవాన్ రెడ్డి, డాక్టర్ రాజేష్, విట్టల్, చిరంజీవి, అంబయ్య, కృష్ణ, రాజేష్ , శ్రీనివాస్, అనిత, సుధాకర్ రెడ్డి, మనోహర్, శేఖర్ పాల్గొన్నారు.

    ఎస్​ఆర్​ఎన్​కే డిగ్రీ కళాశాలలో ప్రతిజ్ఞ చేస్తున్న ప్రిన్సిపల్​, అధ్యాపకులు

    Latest articles

    Kalyani project | కళ్యాణి ప్రాజెక్ట్​కు జలకళ.. రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kalyani project | ఉమ్మడి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా వానలు...

    Weather Updates | దంచికొట్టిన వాన.. మరో రెండ్రోజులు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | తెలంగాణ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన...

    Uttar Pradesh | దారుణాతి దారుణం..రెండేళ్ల కుమారుడికి కన్నతండ్రే పురుగుల‌ మందు తాగించి ఆపై మేడపై నుంచి తోసేశాడు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని Uttar Pradesh చిటౌవ గ్రామంలో హృదయాలను కలచివేసే సంఘటన చోటు...

    Pocharam project | నిండు కుండలా పోచారం ప్రాజెక్టు.. దూకుతున్న అలుగు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam project : కామారెడ్డి జిల్లా(Kamareddy district)లో ఎల్లారెడ్డి (Yellareddy), నాగిరెడ్డిపేట్ (Nagireddypet) మండలాల వరప్రదాయిని...

    More like this