ePaper
More
    Homeబిజినెస్​Stock Market | తగ్గిన ద్రవ్యోల్బణం.. పెరిగిన సూచీలు

    Stock Market | తగ్గిన ద్రవ్యోల్బణం.. పెరిగిన సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail inflation) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కంఫర్ట్‌ జోన్‌కన్నా దిగువకు పడిపోవడం, గ్లోబల్‌ మార్కెట్లు (Golbal markets) పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు సైతం సానుకూలంగా స్పందించాయి. ఒడిదుడుకులకు లోనైనా లాభాల్లోనే సాగాయి.

    బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 257 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా కొద్దిసేపటికి 162 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత పుంజుకుని 233 పాయింట్లు పెరిగింది. 99 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty) ఆ తర్వాత 51 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 79 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం తర్వాత ప్రధాన సూచీలు పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్‌(Sensex) 304 పాయింట్ల లాభంతో 80,539 వద్ద, నిఫ్టీ 131 పాయింట్ల లాభంతో 24,619 వద్ద నిలిచాయి.

    Stock Market | అడ్వాన్సెస్‌, డిక్లయిన్స్‌..

    బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,230 కంపెనీలు లాభపడగా 1,864 స్టాక్స్‌ నష్టపోయాయి. 152 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 109 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 104 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 5 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

    Stock Market | పీఎస్‌యూ బ్యాంక్స్‌ మినహా..

    బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌(PSU Banks), ఎఫ్‌ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాలు లాభాల బాటలో సాగాయి. హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌(Healthcare index) 1.76 శాతం, మెటల్‌ ఇండెక్స్‌ 1.22 శాతం, ఆటో ఇండెక్స్‌ 1.18 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 1.01 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 0.74 శాతం, పీఎస్‌యూ 0.57 శాతం పెరిగాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.15 శాతం, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌లు 0.03 శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 0.58 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.56 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.53 శాతం లాభాలతో ముగిశాయి.

    Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో, 08 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్‌ 2.25 శాతం, ఎటర్నల్‌ 2.08 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 1.56 శాతం, టాటా మోటార్స్‌ 1.48 శాతం, ఎంఅండ్‌ఎం 1.42 శాతం లాభపడ్డాయి.

    Top Losers : అదాని పోర్ట్స్‌ 0.78 శాతం, ఐటీసీ 0.58 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.46 శాతం, టైటాన్‌ 0.34 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.22 శాతం నష్టపోయాయి.

    Latest articles

    Nizamabad | విస్తృతంగా మున్నూరు కాపు సభ్యత్వ నమోదు

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | జిల్లాలో మున్నూరు కాపుల సభ్యత్వ నమోదు (Membership Drive) ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర...

    Heavy Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే...

    Arjun Tendulkar | అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం.. బిజినెస్ రంగానికి చెందిన సానియా చందోక్‌తో కొత్త జర్నీ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Arjun Tendulkar : లెజెండరీ క్రికెటర్, 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ (Sachin...

    Pakistan Independence Day | పాక్ స్వాతంత్య్ర వేడుక‌ల‌లో పేలిన తూటా.. ముగ్గురి దుర్మరణం.. 60 మందికి పైగా గాయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pakistan Independence Day : పాకిస్థాన్‌ (Pakistan) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ఆర్థిక రాజధాని కరాచీలో...

    More like this