అక్షరటుడే, వెబ్‌డెస్క్: Coolie Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Director Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై (Sun Pictures Banner) కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మరికొద్ది గంటలలో చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
Coolie Movie | ఆధార్ తప్పనిసరి..
‘కూలీ’ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ A సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఇది అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా అని అర్థం. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ యాజమాన్యాలు (Theater Owners) తమ తమ స్క్రీన్‌ల వద్ద కొన్ని కీలక సూచనలను విడుదల చేశాయి. థియేటర్ యాజమాన్యాలు స్పష్టంగా ప్రకటించిన కీలక నిబంధనలలో 18 ఏళ్లు లోపు వయస్సు ఉన్న వారికి ‘కూలీ’ సినిమా చూసేందుకు ఎంట్రీ లేదు. సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా గవర్నమెంట్ గుర్తింపు కలిగిన ఐడీ ప్రూఫ్ (Government Issued ID Proof) (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ వంటివి) తీసుకురావాలి.
ఏవైనా సందేహాలు ఉన్నా థియేటర్ సిబ్బందిని సంప్రదించవచ్చు. ఇక రజనీ (Super Star Rajinikanth) సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా సూపర్ హిట్ కావాలని పూజలు చేస్తున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ‘కూలీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ మాస్ ఎలివేషన్, లోకేష్ మార్క్ డైరెక్షన్, భారీ తారాగణం ఈ సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచాయి. ఇప్పుడు A సర్టిఫికెట్‌తో పాటు థియేటర్ల యాజమాన్యం తీసుకుంటున్న కఠిన నిబంధనలతో ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సినిమా థియేటర్లలో ఎంత వరకు హవా చూపిస్తుందో చూడాల్సిందే.