అక్షరటుడే ఇందూరు: Mp Arvind | రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం చేయడంతోనే ఆర్వోబీల (ROB) పనులు ఆలస్యమవుతున్నాయని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో (Nizamabad Collectorate) బుధవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్‌ను (Finance Minister) కలుస్తానని పేర్కొన్నారు.
Mp Arvind | కోట్లల్లో నిధులు రావాల్సి ఉంది..
నగర శివారులోని మాధవనగర్ (madav nagar), అర్సపల్లి (Arsapally), అడవి మామిడిపల్లి (adavi mamidipally) రైల్వే ఓవర్ బ్రిడ్జి (Railway overbridge) పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.కోట్లల్లో నిధులు రావాల్సి ఉందన్నారు.
ప్రధానంగా మాధవనగర్‌కు సంబంధించి రూ.3 కోట్లు, రివైజ్డ్ నిధులు రూ.8.5కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే అర్సపల్లి ల్యాండ్‌కు సంబంధించి సుమారు రూ.10 కోట్లు హోల్డ్‌లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తానని పేర్కొన్నారు. కేవలం అభివృద్ధి పనుల నిమిత్తం మాత్రమే కలుస్తానని ఆయన స్పష్టం చేశారు.