అక్షరటుడే, వెబ్‌డెస్క్: Railway Passengers | దేశవ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడంతో రైల్వేశాఖ కూడా కొత్తగా రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. రైళ్ల రద్దీ తగ్గించడానికి కొత్త ట్రాక్‌లను సైతం నిర్మిస్తోంది. ఇందులో భాగంగా పలు బైపాస్లైన్లను నిర్మిస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ (Peddapalli Bypass railway line) అందుబాటులోకి రాగా.. తాజాగా పాపట్‌పల్లి – డోర్నకల్ బైపాస్ మధ్య 3వ రైల్వే లైను నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
Railway Passengers | ఐదు రోజుల పాటు..
పాపట్‌పల్లి – డోర్నకల్ రైల్వే లైన్ (Papatpalli – Dornakal railway line) పనులతో ఐదు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఆగస్టు 14 నుంచి 18 వరకు పది రైళ్లను పూర్తిగా రద్దు చేశామని తెలిపింది. డోర్నకల్ – విజయవాడ(67767), విజయవాడ – డోర్నకల్ (67768), కాజీపేట- డోర్నకల్ (67765), డోర్నకల్- కాజీపేట (67766), విజయవాడ- సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్- విజయవాడ (12714), విజయవాడ- భద్రాచలం రోడ్ (67215), భద్రాచలం రోడ్- విజయవాడ (67216), గుంటూరు- సికింద్రాబాద్ (12705), సికింద్రాబాద్- గుంటూరు (12706) రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
Railway Passengers | ప్రయాణికులు గమనించాలి
రైళ్లు రద్దు అయిన విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ (Railways) సూచించింది. అందుకు అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని పేర్కొంది. ట్రెయిన్లలో ప్రయాణిస్తున్నప్పుడు సహాయం కావాలంటే 139కు డయల్ చేయాలని అధికారులు సూచించారు.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వరంగల్ రైల్వే స్టేషన్లో ట్రాక్‌లపైకి నీరు చేరడంతో మంగళవారం ఉదయం ప్రయాణికులు (passengers) తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. మరో మూడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. దీంతో రైలు రాకపోకల్లో అంతరాయం కలిగే అవకాశం ఉంది.