అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం అయిపోయి ఏడాదిన్నర అవుతోంది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసి కూడా ఏడాది దాటిపోయింది. అయినా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లేక పోవడంతో పర్యవేక్షణ కొరవడింది. పట్టించుకునే వారు లేకపోవడంతో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఈ క్రమంలో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.
Local Body Elections | తేలని రిజర్వేషన్ల పంచాయితీ
బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశం తేలకపోవడంతో స్థానిక ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చాక స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై కేంద్రం నుంచి ఆమోదం లభించకపోవడంతో ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతోంది. అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ కూడా ఇచ్చింది. అంతేగాకుండా జిల్లాల వారీగా బ్యాలెట్ బాక్సులను సైతం పంపించారు. తాజాగా గుజరాత్ 37,500 బ్యాలెట్ బాక్సులు (Ballot Boxes) హైదరాబాద్ (Hyderabad)కు చేరుకున్నాయి. వీటిని జిల్లాల వారీగా పంపించనున్నారు.
Local Body Elections | పార్టీ పరంగా రిజర్వేషన్లు
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందించడం లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఇంత వరకు సంతకం చేయలేదు. దీంతో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ (Congress) పార్టీ నుంచి బీసీ అభ్యర్థులకు 42శాతం టికెట్లు ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) జరగనుంది. ఆ మీటింగ్‌లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. పంచాయతీ అధికారులతో గురువారం సీఎం భేటీ కానున్నారు. దీంతో త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.