అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heavy Rains | రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరం అతలాకుతలం అయింది. సోమవారం రాత్రి మంగళవారం తెల్లవారు జామున వరకు భారీ వర్షాలు(Heavy Rains) పడ్డాయి. మంగళవారం రాత్రి సైతం నగరంలో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది.
వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నేడు, రేపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు (Private Schools) సెలవు ప్రకటిస్తూ.. అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) హెచ్చరించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Heavy Rains | పొంగిపొర్లుతున్న వాగులు
ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District) వ్యాప్తంగా కుండపోత వానలు పడడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నీరు చేరింది. పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోకి వరద నీరు చేరడంతో రోగులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వర్ధన్నపేటలో ఆకేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో తహశీల్దార్ కార్యాలయం నీట మునిగింది.
Heavy Rains | పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు
వరంగల్ నగరంలో వదర పోటెత్తడంతో చాలా కాలనీల్లోకి నీరు వచ్చి చేరింది. ఇళ్లలోకి నీరు రావడంతో వస్తువులు అన్ని తడిసిపోయాయి. వాహనాలు నీట మునిగి పాడైపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నేడు కూడా భారీ వర్ష సూచన ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Heavy Rains | ఆదిలాబాద్ జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి వాన దంచికొట్టింది. ఆసిఫాబాద్ జిల్లాలో దుగ్గపూర్ వాగు ఉధృతంగా పారుతోంది. తిర్యాణి మండలం నుంచి తాండూర్ ఐబీకి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.