ePaper
More
    HomeFeaturesLava Blaze Amoled 2 | లావా నుంచి స్లిమ్మెస్ట్‌ ఫోన్‌

    Lava Blaze Amoled 2 | లావా నుంచి స్లిమ్మెస్ట్‌ ఫోన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lava Blaze Amoled 2 | దేశీయ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ అయిన లావా(LAVA) దూకుడు కొనసాగిస్తోంది. వరుసగా నూతన మోడళ్లను రిలీజ్‌ చేస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా లావా బ్లేజ్‌ అమోలెడ్‌ 2(Lava Blaze Amoled 2) పేరుతో మరో మోడల్‌ను లాంచ్‌ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ లీనియా డిజైన్‌తో 7.55 ఎంఎం మందంతో ఈ సెగ్మెంట్‌లో అత్యంత స్లిమ్‌గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. లావా రిటైల్‌ స్టోర్ల(Lava retail stores)తోపాటు అమెజాన్‌లో ఈనెల 16 నుంచి అందుబాటులో ఉండనున్న ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉన్నాయి.

    డిస్‌ప్లే : ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌, 120 Hz రిఫ్రెష్‌ రేట్‌తో వస్తున్న ఈ మోడల్‌ ఫోన్‌ 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

    ప్రాసెసర్‌ : మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌తో తీసుకువస్తున్నారు. ఇది 2.6 జీహెచ్‌జెడ్‌ గరిష్ట క్లాక్‌ స్పీడ్‌ను అందిస్తుంది. ఇది 6 జీబీ LPDDR5 ర్యామ్‌, 6 జీబీ వర్చువల్‌ మెమరీతో పాటు 128 జీబీ UFS 3.1 ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌తో రానుంది. అంటుటు స్కోర్‌ 500000.

    ఆపరేటింగ్‌ సిస్టమ్‌ : ఆండ్రాయిడ్‌ 15తో నడుస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 వరకు అప్‌డేట్‌ ఇస్తారు. రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ వస్తాయి.

    కెమెరా సెటప్‌ : తెలుపు రంగు బ్యాక్‌ ప్యానెల్‌తో వస్తున్న లావా బ్లేజ్‌ అమోలెడ్‌ 2 మోడల్‌.. నలుపు రంగులో దీర్ఘ చతురస్రాకారంలో కెమెరాను ఫిక్స్‌ చేశారు. వెనుక ప్యానెల్‌లో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో పాటు ఏఐ ఆధారిత 50 మెగాపిక్సెల్‌ సోనీ IMX752 డ్యుయల్‌ సెన్సార్‌ సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం ముందు భాగంలో 8 ఎంపీ సెన్సార్‌ ఉంది.

    బ్యాటరీ : 5,000 mAh బ్యాటరీ సామర్థ్యం గల ఈ ఫోన్‌.. 33w వైర్డ్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

    సెఫ్టీ ఫీచర్స్‌ : IP64 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌ కలిగి ఉంది. సేఫ్టీ విషయంలో ఇది ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ ఉన్నాయి.

    వేరియంట్‌ : ఫోన్‌ను సింగిల్‌ వేరియంట్‌లో తీసుకువచ్చారు. 6 జీబీ, 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 13,499. ఐసీఐసీఐ అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డ్‌పై 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.
    ఫెదర్‌ వైట్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

    Latest articles

    Student refuses Governor | గవర్నర్​ నుంచి డిగ్రీ పట్టా తీసుకునేందుకు నిరాకరించిన విద్యార్థిని

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Student refuses Governor : ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని అనూహ్యంగా ప్రవర్తించింది. స్నాతకోత్సవం(convocation)లో ముఖ్య అతిథి...

    America | అమెరికాలో ఇండియన్లకు కొత్త సమస్యలు.. గడువుకు ముందే బహిష్కరణ నోటీసులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: America : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తిరిగి అధికారంలోకి...

    Indiramma house | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​.. గృహ ప్రవేశాలపై సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Indiramma house : రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని...

    Girlfriend turns thief | ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Girlfriend turns thief | ఇటీవల వక్ర ప్రేమ కథలు ఎక్కవగా ప్రచారం అవుతున్నాయి. ప్రియుడి...

    More like this