అక్షరటుడే, ఇందూరు: Jenda Balaji Temple | నగరంలోని జెండా బాలాజీ ఆలయ జాతర ఉత్సవాలు (Flag Fair) ఈనెల 24 నుంచి ప్రారంభమవుతున్నట్లు వంశపారపర్య అర్చకులు అజయ్ సంగ్వాయి తెలిపారు. ఇందులో భాగంగా బాలాజీ జెండా శోభాయాత్ర (Balaji Jenda Shobhayatra) నగరంలోని పెద్ద బజార్లోని తమ స్వగృహం నుంచి ప్రారంభమవుతుందన్నారు.
అక్కడి నుంచి బార్సింగ్ బాబా మందిరం గాజుల్పేట్, హనుమాన్ మందిరం, వైరాగర్ కాంపౌండ్, పెద్ద రాంమందిర్, చక్రం గుడి, చిన్న రాంమందిర్, తిరిగి పెద్ద బజార్ చౌరస్తా, బబుల్ రథం ఆలయం కసాబ్ గల్లి, నర్సా గౌడ్ హనుమాన్ ఆలయం మీదుగా జెండా బాలాజీ ఆలయానికి (Jenda Balaji Temple) చేరుకుంటుందన్నారు. ఆలయంలో జెండాను ప్రతిష్టించిన అనంతరం 15 రోజులపాటు నిత్య పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కావున భక్తులు స్వామివారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు కోరారు.