అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vice President | భారత ఉపరాష్ట్ర పదవికి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad) రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో ఆయన జులై 21 తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. దీంతో త్వరలో కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ (Notification) కూడా జారీ చేసింది. ఆగస్టు 21లోగా నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి సంఖ్యా బలం అధికంగా ఉండడంతో సులువుగానే పీఠాన్ని దక్కించుకోనుంది. అయితే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెడుతుందా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎన్డీఏ (NDA) నుంచి ఉపరాష్ట్రపతి పదవికి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ (RSS) నేపథ్యం ఉన్న శేషాద్రి రామానుజాచారి (Seshadri Ramanujachari)ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోనున్నట్లు సమాచారం.
Vice President | ఆర్ఎస్ఎస్ నుంచి..
గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ (BJP) మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్లు నిండిన వారు పదవులను వదులుకోవాలని వ్యాఖ్యానించారు. మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న రామానాజాచారిని ఉపరాష్ట్రపతి చేయనున్నట్లు తెలుస్తోంది. ముంబైలో పుట్టి పెరిగిన ఆయన చిన్ననాటి నుంచే ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. నాలుగేళ్ల వయసు నుంచి సంఘ్ శాఖకు వెళ్లారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుపాలు కూడా అయ్యారు.
Vice President | కీలక పదవులు
బీకామ్, ఎల్ఎల్‌బీ, ఎంఏ, పీహెచ్‌డీ చేసిన రామానుజా చారి ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్‌కు ఎడిటర్‌గా సైతం పని చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP)లో పాలన సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం దక్షిణ సూడాన్‌లోని జుబాలో పని చేస్తున్నాడు. ఈయనను ఉపరాష్ట్రపతిగా నియమించాలని ఆర్ఎస్ఎస్ సూచించినట్లు సమాచారం. అయితే ఎన్డీఏ కూటమిలోని మిగతా పార్టీలతో చర్చించి బీజేపీ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.