అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs ENG : భారత్, ఇంగ్లండ్ England TeaM జట్ల మధ్య జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచింది.
ఇంగ్లండ్ వేదికగా నిర్వహించిన అండర్సన్-సచిన్ ట్రోఫీ సిరీస్‌కు అనూహ్యంగా ప్రేక్షకాదరణ లభించింది. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై ఈ టెస్ట్ మ్యాచ్‌లు విపరీతమైన వ్యూస్ రాబట్టాయి.
148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో, ఒక సుదీర్ఘ సిరీస్‌ను ఈ స్థాయిలో డిజిటల్ వేదికగా వీక్షించడం ఇదే తొలిసారి. సిరీస్‌లో చివరిదైన ఓవల్ టెస్ట్ ఆఖరి రోజు నిజమైన రికార్డు షోగా మారింది.
జియో హాట్‌స్టార్ వేదికగా ఈ మ్యాచ్‌ను 1.3 కోట్ల మంది లైవ్‌లో చూశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌కు ఇంత భారీ స్థాయిలో వ్యూస్ రావడం ఇదే తొలిసారిగా చెప్పవచ్చు.
IND vs ENG | ఇదే తొలిసారి..
ఈ సిరీస్ మొత్తం ప్రేక్షకులకు ఉత్కంఠని కలిగిస్తూ ఆసక్తిగా సాగింది. ఐదు టెస్ట్‌ల్లో చోటు చేసుకున్న ఆసక్తికర ఘట్టాలు చూస్తే..1వ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 371 పరుగుల ఛేదనలో 5 వికెట్ల తేడాతో గెలిచింది.
2వ టెస్ట్ లో భారత్ 608 పరుగుల భారీ లక్ష్యంతో ఇంగ్లండ్‌ను 336 పరుగుల తేడాతో ఓడించింది. 3వ టెస్ట్ (లార్డ్స్) ఉత్కంఠగా సాగగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలిచింది.
టీమిండియా చివర్లో కుదేలైంది. 4వ టెస్ట్ డ్రాగా ముగిసింది. జడేజా Jadeja, వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్‌తో ఓటమి నుండి తప్పించుకున్నారు.
ఇక 5వ టెస్ట్ విజేతను నిర్ణయించే మ్యాచ్ కాగా, చివరి రోజు ఇంగ్లండ్‌కు England 35 పరుగులు, భారత్‌కు 4 వికెట్లు కావాల్సిన పరిస్థితి. సిరాజ్ అద్భుత స్పెల్‌తో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి టీమిండియా(TEAM INDIA)ని గెలిపించాడు.
ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టెస్ట్ సిరీస్ చివరికి 2-2తో సమం అయింది. టెస్టులపైనా విపరీతమైన క్రేజ్ ఉందని, ఈ సిరీస్ నిరూపించింది.
ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్ కూడా దాదాపు ఐదు రోజుల పాటు సాగడంతో పాటు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. నువ్వా, నేనా అన్నట్టు మ్యాచ్ సాగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్‌లని ఆసక్తిగా వీక్షించారు. ఈ క్రమంలోనే పలు రికార్డులు నమోదయ్యాయి.