ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌...

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : యూఎస్‌(US)లో జులైకి సంబంధించి ద్రవ్యోల్బణం(Inflation) అంచనాలకు అనుగుణంగా ఉండటంతో వాల్‌స్ట్రీట్‌ పరుగులు తీసింది. ఇన్ఫ్లెషన్‌ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఈసారి రేట్‌ కట్‌ ఉండవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పాల్పడ్డారు.

    దీంతో గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) జోరుమీదున్నాయి. మంగళవారం యూఎస్‌ మార్కెట్లు లాభాలతో, యూరోప్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ లాభాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ సైతం పాజిటివ్‌గా ఉంది.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    వచ్చేనెలలో ఫెడ్‌ రేట్‌ కట్‌(Rate cut) చేస్తుందన్న అంచనాలతో వాల్‌స్ట్రీట్‌ భారీ లాభాలతో ముగిసింది. గత ట్రేడిరగ్‌ సెషన్‌ నాస్‌డాక్‌ 1.39 శాతం, ఎస్‌అండ్‌పీ 1.13 శాతం పెరిగాయి. బుధవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ ఫ్లాట్‌గా ఉంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    సీఏసీ(CAC) 0.71 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.20 శాతం పెరగ్గా.. డీఏఎక్స్‌ 0.24 శాతం నష్టపోయింది.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    భారత్‌, జపాన్‌లలో ఇన్ఫ్లెషన్‌ అదుపులో ఉండడంతో ప్రధాన ఆసియా మార్కెట్లు అన్నీ పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8.10 గంటల సమయంలో నిక్కీ 1.36 శాతం, హాంగ్‌సెంగ్‌ 1.28 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.92 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.82 శాతం, కోస్పీ 0.67 శాతం, షాంఘై 0.25 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.53 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్‌ అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 3,398 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు 27వ ట్రేడిరగ్‌ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా కొనసాగారు. నికరంగా రూ. 3,507 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.03 నుంచి 0.78కు పడిపోయింది. విక్స్‌(VIX) 0.12 శాతం పెరిగి 12.23కి చేరింది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.06 శాతం తగ్గి 66.08 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు బలహీనపడి 87.71 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.30 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.07 వద్ద కొనసాగుతున్నాయి.
    • భారత్‌(Bharath) వార్షిక రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.10 శాతంనుంచి 1.55 శాతానికి పడిపోయింది. ఇది గత ఎనిమిది సంవత్సరాలలో అత్యత్ప స్థాయి.
    • జపాన్‌ వార్షిక టోకు ద్రవ్యోల్బణం కూడా జూలైలో తగ్గింది. 2.9 శాతంనుంచి 2.6 శాతానికి తగ్గింది.

    Latest articles

    Student refuses Governor | గవర్నర్​ నుంచి డిగ్రీ పట్టా తీసుకునేందుకు నిరాకరించిన విద్యార్థిని

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Student refuses Governor : ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని అనూహ్యంగా ప్రవర్తించింది. స్నాతకోత్సవం(convocation)లో ముఖ్య అతిథి...

    America | అమెరికాలో ఇండియన్లకు కొత్త సమస్యలు.. గడువుకు ముందే బహిష్కరణ నోటీసులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: America : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తిరిగి అధికారంలోకి...

    Indiramma house | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​.. గృహ ప్రవేశాలపై సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Indiramma house : రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని...

    Girlfriend turns thief | ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Girlfriend turns thief | ఇటీవల వక్ర ప్రేమ కథలు ఎక్కవగా ప్రచారం అవుతున్నాయి. ప్రియుడి...

    More like this