అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : దేశంలో బంగారం Gold ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేని పరిస్థితి. మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి.
నిన్నటితో పోలిస్తే నేడు (ఆగస్టు 13) బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,390గా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,940గా ఉంది.
ఇక కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.2,100 తగ్గింది. దీంతో వెండి ధర ఇప్పుడు రూ.1,14,900 వద్ద కొనసాగుతోంది. ఇక పది గ్రాముల ప్లాటినం platinum ధర రూ.37,130గా ఉంది.
Today Gold Price : కాస్త తగ్గుదల..
- దేశ రాజధాని ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల బంగారం (24-carat gold) ధర రూ.1,01,540గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.93.090గా ట్రేడ్ అయింది.
- ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,390 గా నమోదు కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,940గా ఉంది.
- హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,01,390గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,940గా నమోదు అయింది.
ఇక దేశంలో వెండి ధరలు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయి అనేది చూస్తే..
- ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, పుణేలో కేజీ వెండి ధర రూ.1,14,900గా ఉంది.
- హైదరాబాద్ Hyderabad, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలలో కిలో వెండి ధర రూ.1,24,900గా కొనసాగుతోంది.
అమెరికా – చైనా మధ్య వాణిజ్య పరమైన చర్చలు, భౌగోళిక రాజకీయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు బంగారం ధరలని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. రాబోయే రోజులలో కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.