ePaper
More
    HomeUncategorizedYS Jagan | జడ్పీటీసీ ఉప ఎన్నికల హైజాక్​.. ఏపీలో అరాచక పాలన : వైఎస్సార్సీపీ...

    YS Jagan | జడ్పీటీసీ ఉప ఎన్నికల హైజాక్​.. ఏపీలో అరాచక పాలన : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్

    Published on

    అక్షరటుడే, అమరావతి : YS Jagan | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్​ రెడ్డి (YSRCP chief, former CM YS Jaganmohan Reddy) ధ్వజమెత్తారు. ఒంటిమిట్ట (Ontimitta), పులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నికలలో అరాచకాలు జరిగాయంటూ మంగళవారం (ఆగస్టు 12) ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘రాష్ట్రంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్​ జగన్​ ఆరోపించారు. పులివెందుల నియోజకవర్గంలోని ఒక ZPTC సీటును లాక్కునేందుకు అరాచకం చేశారని అన్నారు. రాజంపేటలోని ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా తీసుకునేందుకు ఒక గూండా మాదిరిగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.

    YS Jagan | జడ్పీటీసీ ఉప ఎన్నికల హైజాక్​..

    రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని వైఎస్​ జగన్​ ఆరోపించారు. సీఎంగా ఆయనకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకున్నారని, పోలీసుల సాయంతో ఈ ఉప ఎన్నికలను తీవ్రవాదుల మాదిరి హైజాక్ చేశారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.

    YS Jagan | ఇది నిజంగా ఒక బ్లాక్​ డే..

    జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచారని వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు నిజంగా ఒక బ్లాక్ డే అని పేర్కొన్నారు. ఒంటిమిట్ట (Ontimitta), పులివెందుల (Pulivendula) ZPTC ఉప ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. కేంద్ర బలగాల అధీనంలో తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ జగన్ మోహన్​ రెడ్డి డిమాండ్ చేశారు.

    Latest articles

    Vote Chori | కాంగ్రెస్ ఓట్ల చోరీపై బీజేపీ ఎదురుదాడి.. పౌరసత్వం లేకుండానే సోనియా ఓటుహక్కు పొందారని ఆరోపణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vote Chori | బీజేపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపై (Central Election Commission) కాంగ్రెస్...

    Singur Project | సింగూరు వరద గేటు ఎత్తివేత

    అక్షరటుడే, నిజాంసాగర్: Singur Project | మంజీరా(Manjeera) పరివాహక ప్రాంతంలోని సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్​ను...

    Collector Nizamabad | భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | రానున్న రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశముందని...

    KTR | అలా చేసినట్లు చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్...

    More like this