ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిsand Illegal transportation | రూ.900కు కొనుగోలు చేసి.. రూ.9 వేలకు విక్రయం.. ఇందిరమ్మ ఇళ్ల...

    sand Illegal transportation | రూ.900కు కొనుగోలు చేసి.. రూ.9 వేలకు విక్రయం.. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: sand Illegal transportation : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses) నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణానికి కావాల్సిన ఇసుకను తరలించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. సమీప వాగులు, నదుల నుంచి భారీ మొత్తంలో ఇసుక నిల్వలను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
    అడ్డదారిలో అందలం ఎక్కేందుకు అడ్డగోలుగా ఇసుకను తరలిస్తూ.. చివరికి పోలీసులకు ఇచ్చారు ఇసుకాసురులు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా (Kamareddy district) జుక్కల్​ మండలంలో చోటుచేసుకుంది. ఒక్కో ట్రాక్టర్​ లోడును రూ. 900కు కొనుగోలు చేసి, రూ.9,000కు విక్రయిస్తూ నిత్యం రూ.లక్షల్లో ఆర్జిస్తున్న నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.

    sand Illegal transportation : అసలేం జరిగిందంటే..

    జుక్కల్​ మండలం సోపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల(construction) కు ఇసుక అవసరం ఉందని హస్గుల్​​ గ్రామానికి చెందిన మహమ్మద్ ఆదిల్ అనే వ్యక్తి MRO నుంచి పర్మిషన్​ తీసుకున్నాడు. మంజీర నది పరీవాహక ప్రాంతం హస్గుల్​​లో ట్రాక్టర్​ లోడు ఇసుకను రు.900కు కొనుగోలు చేసి, తన ట్రాక్టర్ ద్వారా డ్రైవర్ గోరి సహాయంతో కర్ణాటకకు చెందిన మదన్ సోపేంద్ర బీరాదకు రూ.9,000కు విక్రయించేవాడు. ఈ తతంగం చాలా రోజులుగా కొనసాగుతోంది.
    కాగా.. జుక్కల్​ పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతున్న సమయంలో డ్రైవర్​ గోరి ఇసుక లోడుతో పట్టుబడ్డాడు. విచారణలో ఇసుక అక్రమ రవాణా బయటపడింది. ఈ మేరకు మహమ్మద్ ఆదిల్, గోరి, కర్ణాటకకు చెందిన మదన్ సోపేంద్ర బీరాదపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 14 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Student refuses Governor | గవర్నర్​ నుంచి డిగ్రీ పట్టా తీసుకునేందుకు నిరాకరించిన విద్యార్థిని

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Student refuses Governor : ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని అనూహ్యంగా ప్రవర్తించింది. స్నాతకోత్సవం(convocation)లో ముఖ్య అతిథి...

    America | అమెరికాలో ఇండియన్లకు కొత్త సమస్యలు.. గడువుకు ముందే బహిష్కరణ నోటీసులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: America : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తిరిగి అధికారంలోకి...

    Indiramma house | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​.. గృహ ప్రవేశాలపై సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Indiramma house : రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని...

    More like this