అక్షరటుడే, ఇందూరు: heavy rain forecast : రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) మంగళవారం మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary), డీజీపీతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాల సూచనలు నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మూగజీవాలు ప్రాణాలు కోల్పోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటూ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ప్రధానంగా రెవెన్యూ revenue , పోలీస్, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్ panchayat raj, రోడ్లు భవనాల శాఖ roads and buildings department, విపత్తు నిర్వహణ disaster management సంస్థలు రాబోయే మూడు రోజులపాటు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
ప్రజలు కూడా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్, ఆయా శాఖల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలకు సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు. రానున్న మూడు రోజులు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులపై తగు నిర్ణయం తీసుకోవాలన్నారు.
heavy rain forecast : నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..
లోతట్టు ప్రాంతాలు (low-lying areas), నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వ్యవహరించాలని చెప్పారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వంతెనలు, కాజ్వే మీదుగా వరద ప్రవాహం ఉన్న సమయాల్లో రాకపోకలు నిషేధించాలని చెరువులు, కాల్వలు, నదుల్లో చేపల వేట, ఈత కోసం ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపోవడం ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడం వంటివి చోటు చేసుకున్న సందర్భాల్లో యుద్ధ ప్రాతి ప్రాధిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు.
heavy rain forecast : ఆ ఇళ్లను ఖాళీ చేయించండి..
శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందునా..వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.