Armoor Bar Association
Armoor Bar Association | ఆర్మూర్​లో న్యాయవాదులకు ఆటల పోటీలు

అక్షరటుడే, ఆర్మూర్‌: Armoor Bar Association | పట్టణంలోని కోర్టు ఆవరణలో మంగళవారం న్యాయవాదులకు ఆటల పోటీలు నిర్వహించారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల (Independence Day celebrations) సందర్భంగా ఈ మేరకు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించినట్లు అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జక్కుల శ్రీధర్, జెస్సు అనిల్‌కుమార్‌ తెలిపారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి (Senior Civil Judge Sridevi), అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి సరళ రాణి హాజరై పోటీలు ప్రారంభించారు.

కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు లోక భూపతిరెడ్డి, తులసీదాస్‌ క్రాంతి, ఎంకే నరేందర్, చిలుక కిష్టయ్య, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు గటడి ఆనంద్, లైబ్రరీ సెక్రెటరీ శ్రావణ్‌ కుందారం, న్యాయవాదులు పోచన్న, తాజొద్దీన్, రాము,అశోక్‌ ఐనారి, జి జి రాములు, బాలయ్య, ఎంకె నాగరాజు, దాస్, కిరణ్,శ్యామ్‌ యాదవ్, సురేష్, నందిన్‌ తదితరులు పాల్గొన్నారు.