అక్షరటుడే, ఆర్మూర్: Pre primary school | ఆలూర్ మండల కేంద్రంతో పాటు దేగాంలో (degam) రెండు ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు ఎంఈవో నరేందర్ తెలిపారు.
2025–26 విద్యాసంవత్సరానికి గాను ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో ఓ ఉపాధ్యాయుడితోపాటు ఆయాను నియమించనున్నట్లు చెప్పారు.
టీచర్ పోస్టుకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ (Elementary Education Training) పూర్తి చేసినవారు, ఆయా నియామకానికి కనీసం 7వ తరగతి ఉత్తీర్ణతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగలవారు ఈనెల 15లోపు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులను అందించాలన్నారు. డీఈవో (DEO) ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ అనంతరం తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారని తెలిపారు.