అక్షరటుడే, ఇందూరు: Giriraj College | గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా, ఎన్సీసీ అధికారిగా (NCC officer) విధులు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ డాక్టర్ మేకల రామస్వామికి (Mekala Rama swamy) అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి లభించింది.
ఈ మేరకు విద్యా కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రామస్వామిని సన్మానించారు. విధుల పట్ల నిబద్ధత, క్రమశిక్షణ ఉన్న అధ్యాపకుడు డాక్టర్ రామస్వామి అని కొనియాడారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, ఐక్యుఏసీ (IQAC) కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, పరీక్షల నియంత్రణ అధికారి భరద్వాజ్, అకడమిక్ కో–ఆర్డినేటర్ నహీదా బేగం, స్టాప్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ రంజిత, పీఆర్ఓ డాక్టర్ దండు స్వామి, వినయ్ కుమార్, రమేష్ గౌడ్, రామకృష్ణ, అనసూయ తదితరులు పాల్గొన్నారు.