అక్షరటుడే, ఇందూరు: Kakatiya institutions | కాకతీయ విద్యాసంస్థల అధ్యక్షుడు మండవ వెంకట సుబ్బారావు కన్నుమూశారు. విద్యాసంస్థల ఛైర్పర్సన్ విజయలక్ష్మి తండ్రి సుబ్బారావు. అనారోగ్యంతో మంగళవారం మరణించారు. కాకతీయ విద్యాసంస్థల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్యాసంస్థ ప్రారంభించిన నాటి నుంచి అహర్నిశలు పని చేశారు. కాకతీయ చిన్న విద్యాసంస్థగా మొదలై నేడు ఉమ్మడి జిల్లాలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన విషయం తెలిసిందే. సుబ్బారావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కుటుంబీకుల సానుభూతి వ్యక్తం చేశారు. కాగా.. సుబ్బారావు అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు.
