ePaper
More
    HomeUncategorizedLions club | డ్రగ్ రహిత సమాజానికి కృషి చేయాలి

    Lions club | డ్రగ్ రహిత సమాజానికి కృషి చేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Lions club | డ్రగ్ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (Anti Narcotics Bureau) డైరెక్టర్ సందీప్ శాండిల్య (Sandeep Sandilya) అన్నారు. నిజామాబాద్​కు చెందిన లయన్స్​ క్లబ్ ప్రతినిధి ప్రసాద్ డ్రగ్స్​ కారణంగా జరిగే దుష్ఫరిణామాలపై షార్ట్ ఫిలిం (Short film) రూపొందించి ప్రదర్శించడంతో మంగళవారం హైదరాబాద్​లో ఆయనను అభినందించారు.

    ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో యువత యూట్యూబ్​ను ఎక్కువగా అనుసరిస్తున్నారని, ఇలాంటి షార్ట్ ఫిల్మ్​ల వల్ల డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కలిగే అవకాశం ఉందన్నారు.

    అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ (Anti-Drug Awareness) డిస్ట్రిక్ట్​ ఛైర్మన్​ విజయానంద్​ను అభినందించారు. కార్యక్రమంలో నార్కోటిక్స్​ బ్యూరో (Narcotics Bureau) ఎస్పీ సీతారాం, ఏఎస్పీ కృష్ణమూర్తి, సీఐ శ్రీనివాసరావు, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంప నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...

    Rohith Sharma | అర్ధ‌రాత్రి ఆసుప‌త్రికి వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌.. అభిమానుల్లో ఆందోళ‌న‌, అస‌లు వాస్తవం ఇది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని...

    Allu Aravind | అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు.. ‘అల్లు బిజినెస్ పార్క్’పై వివాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allu Aravind | అల్లు ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government) షాకుల మీద షాకులు...