ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు.. రూరల్​ కార్యాలయంలో డాక్యుమెంట్ల సృష్టి

    Nizamabad | నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు.. రూరల్​ కార్యాలయంలో డాక్యుమెంట్ల సృష్టి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nizamabad | నిజామాబాద్​ జిల్లాలో నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు జరిపిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రొహిబిటెడ్​ జాబితాలో ఉన్న అసైన్డ్​ భూములకు (Assigned lands) ఏకంగా డాక్యుమెంట్లు సృష్టించారు. ఆన్​లైన్​లో నిషేధిత​ జాబితాలో ఉన్నప్పటికీ.. సబ్​ రిజిస్ట్రార్లు అవేమీ లెక్కచేయకుండా అడ్డదారిలో రిజిస్ట్రేషన్లు చేసి పెట్టడం గమనార్హం.

    నిజామాబాద్​ రూరల్​ కార్యాలయం (nizamabad rural registration office) పరిధిలో గతంలో జరిగిన పలు అక్రమ డాక్యుమెంట్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సారంగపూర్​ శివారులోని సర్వే నం.83లో అసైన్డ్​ భూమి ఉంది. కాగా.. ఈ భూమి ధరణి (ప్రస్తుతం భూమాత పోర్టల్​), రిజిస్ట్రేషన్ల శాఖ ఆన్​లైన్​లో నిషేధిత జాబితాలో ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి లావాదేవీ చేసేందుకు వీలుండదు. అటు రెవెన్యూ అధికారులు గానీ, సబ్​ రిజిస్ట్రార్లు గానీ లావాదేవీలు జరిపేందుకు ఎలాంటి అధికారం ఉండదు. అయినా నిజామాబాద్​ రూరల్​ కార్యాలయం పరిధిలో అసైన్డ్​ భూమికి సంబంధించిన పలు డాక్యుమెంట్లు జరపడం చర్చకు దారి తీసింది.

    సర్వే నం.83 భూమి విషయమై ఓ సామాజిక కార్యకర్త తహశీల్దార్​ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా.. అసైన్డ్​భూమి అని బయటపడింది. కాగా.. ఈ సర్వే నంబర్​లోని ఓ డాక్యుమెంట్​లో 22 గుంటలకు సంబంధించిన అసైన్డ్​ భూమిని సబ్​ రిజిస్ట్రార్లు దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు చేసిపెట్టడం గమనార్హం.

    Nizamabad | తప్పుడు నాలా పత్రాలతో..

    గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం (BRS Government) హయాంలో ధరణి పోర్టల్​ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఆ తర్వాత ధరణి ద్వారానే భూమి తాలూకా నాలా సర్టిఫికెట్లను ఆన్​లైన్​లో జారీ చేశారు. అయితే తాజాగా వెలుగుచూసిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి.. తప్పుడు నాలా పత్రాలను సమర్పించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి అసైన్డ్​భూములకు నాలా జారీ చేయరు. నిషేధిత జాబితాలో ఉన్నందున వీటికి నాలా సర్టిఫికెట్​ ఇచ్చే అధికారం ఎవరికీ ఉండదు.

    అయితే 2020లో నిజామాబాద్​ ఆర్డీవో నాలా సర్టిఫికెట్​ జారీ చేసినట్లు పత్రాలు సృష్టించడం విచిత్రం. ఇవేమీ పరిశీలించకుండానే సబ్​ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు జరపడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి ఓ జూనియర్​ అసిస్టెంట్​ ఈ డాక్యుమెంట్లను చక్కబెట్టినట్లు తెలుస్తోంది.

    Latest articles

    Collector Nizamabad | పూడికతీత పనులను పర్యవేక్షించిన కలెక్టర్​, సీపీ

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు నివాస ప్రాంతాలు, మురికి కాల్వల్లో పూడికతీత...

    Yogi Adityanath | యూపీ సీఎం యోగి పాలనపై ఎస్పీ ఎమ్మెల్యే ప్రశంసలు.. సస్పెండ్ చేసిన పార్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్​ నేరస్తులపై ఉక్కుపాదం...

    VHPS | వికలాంగుల సదస్సును విజయవంతం చేయాలి

    అక్షరటుడే, బోధన్: VHPS | పట్టణంలో నిర్వహించనున్న వికలాంగుల సదస్సును విజయవంతం చేయాలని వీహెచ్​పీఎస్​ జాతీయ అధ్యక్షుడు సుజాత...

    Mla Pocharam | వరి ఉత్పత్తిలో బాన్సువాడది మొదటి స్థానం

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | వరి ఉత్పత్తిలో (Rice production) బాన్సువాడ నియోజకవర్గం (Banswada Constituency) తెలంగాణలో...

    More like this