అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad TDP | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అనంతరం చర్యలు తీసుకోవడం మరిచిపోయిందని టీడీపీ నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదాగౌడ్ ఆరోపించారు.
ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బనకచర్లపై తెలంగాణ ప్రజలకు ఒక అవగాహన ఉందని.. ముందుగా కాళేశ్వరంలో (Kaleshwaram) జరిగిన అవినీతిని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన అప్పటి ప్రభుత్వం గురించి ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని (Mla Prashanth reddy) ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
కాళేశ్వరంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలన గురించి మాట్లాడాలని ప్రశాంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోసారి టీడీపీపై.. ఆంధ్ర సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు.