అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Legal Notice | కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిట్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్ ఎదుట ఇటీవల బండి సంజయ్ విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తనకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్(KTR) అప్పుడే ఎక్స్ వేదికగా స్పందించారు. క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీసులు(Legal Notice) పంపిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా నోటీసులు పంపారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని పేర్కొన్నారు. రాజకీయ ఉనికి కోసమే బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపణలు చేశారన్నారు. తనకు క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
Legal Notice | సిట్ దూకుడు
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు(Sit Officers) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ దూకుడు పెంచింది. నిందితులను విచారించడంతో పాటు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)కు గురైన బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును అరెస్ట్ చేయడానికి చూస్తోంది. ఆయనను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఇప్పటికే అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Legal Notice | బండి సంజయ్ ఆరోపణలతో
ఫోన్ ట్యాపింగ్ అంశంపై బండి సంజయ్ ఇటీవల చేసిన ఆరోపణలతో రాజకీయ రచ్చ మొదలైంది. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. సినీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేశారన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌పై ఆరోపణలు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) ఖండించారు. తాజాగా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. అయితే నోటీసులపై కేంద్ర మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.