Samsung | త‌క్కువ ధ‌ర‌లోనే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌.. రూ.8699కే గెలాక్సీ ఎఫ్‌6
Samsung | త‌క్కువ ధ‌ర‌లోనే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌.. రూ.8699కే గెలాక్సీ ఎఫ్‌6

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samsung Galaxy F06 | ప్ర‌ముఖ ఫోన్ల కంపెనీ సామ్‌సంగ్ త‌క్కువ ధ‌ర‌లో స్మార్ట్ ఫోన్(Smart Phone) కోసం చూసే వారి కోసం కొత్త మోడ‌ల్‌ను తీసుకొచ్చింది. బ‌డ్జెట్ ధ‌ర‌లో Samsung Galaxy F06 5Gని లాంచ్‌ చేసింది. ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు 50MP కెమెరా, 5000mAh ప్రైమరీ కెమెరా కలిగిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 OS వెర్ష‌న్‌తో వ‌చ్చింది. అధునాత‌న ఫీచ‌ర్ల‌తో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరిలో మ‌న మార్కెట్‌లోకి వ‌చ్చిన గెలాక్సీ F06 5G మొద‌ట్లో రూ.10 వేల‌కు పైగా ధ‌ర ఉండేది. అప్ప‌ట్లో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10999 కాగా, అదే 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499 గా ఉంది. అయితే, ప్ర‌స్తుతం త‌క్కువ ధ‌ర‌లోనే వాటిని కొనుగోలు చేసే అవ‌కాశం వ‌చ్చింది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో 4GB ర్యామ్‌ వేరియంట్ రూ.8,699కే ల‌భిస్తోంది. అంటే రూ.2300 డిస్కౌంట్‌లో ల‌భిస్తోంది. ఇక‌, 6GB ర్యామ్‌ ఫోన్‌పై రూ.1300 త‌గ్గింపు పోగా, రూ.10199 కే కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy F06 | 50 ఎంపీ కెమెరా, 7300mAh బ్యాటరీ

Samsung Galaxy F06 ఫోన్‌లో మంచి ఆప్ష‌న్లు ఉన్నాయి. గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత One UI 7.0 ను కలిగి ఉంది. ఎంట్రీ లెవల్‌లో మంచి 5G ఫోన్‌ కోసం చూసే వారికి ఈ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌. దీంతోపాటు నాలుగు సంవత్సరాల వరకు సామ్‌సంగ్ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. మరియు లిట్‌ వైలెట్‌, బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉన్న ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. Knox Vault, వాయిస్‌ ఫోకస్‌, క్విక్‌ షేర్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. రూ.10000 లోపు బ్రాండ్ ఫోన్ కొనాలుకునే వారికి బెస్ట్ చాయిస్‌.