ePaper
More
    HomeతెలంగాణRain Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

    Rain Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | బంగాళాఖాతంలో అల్ప పీడనం (LPA) ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం నుంచి భారీ వర్షాలు (Heavy Rains) పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 12 నుంచి 15 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    ఆగస్టు 12, 13 తేదీల్లో దక్షిణ, తూర్పు తెలంగాణలో అతి భారీ వర్షాలు పడుతాయి. మహబూబ్​నగర్​, నాగర్​ కర్నూల్​, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్​, వరంగల్​ హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో 150 నుంచి 200 మి. మీ. వర్షపాతం నమోదు అయ్యే ఛాన్స్​ ఉంది. ఆగస్టు 14– 15 తేదీల్లో పశ్చిమ, మధ్య తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. నిజామాబాద్​, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్​, రంగారెడ్డి, మహబూబ్​ నగర్​, నాగర్​ కర్నూల్​ జిల్లాల్లో వాన దంచికొట్టనుంది.

    Rain Alert | హైదరాబాద్​ నగరంలో..

    హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వాన దంచికొట్టింది. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో మంగళవారం సాయంత్రం చిరు జల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రిపూట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.

    Rain Alert | దంచికొట్టిన వాన

    రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి వాన దంచికొట్టింది. వరంగల్​, హన్మకొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కుండపోత వాన పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో 150 నుంచి 200 మి. మీ. వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

    Rain Alert | రోడ్డుపై వరద.. రాకపోకలు బంద్​

    వర్షాలతో హైదరాబాద్​ నగరంలోని హిమాయత్​ సాగర్​ (Himayat Sagar)కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి మూసీ నది (Musi River)లోకి నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో హిమాయత్​ సాగర్​ దిగువన ఔటర్​ రింగ్​ రోడ్డు (ORR) సర్వీస్​ రోడ్డుపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపి వేశారు. ఓఆర్​ఆర్​పై ఎగ్జిట్​ 17 నుంచి సర్వీస్​ రోడ్డులోకి రావొద్దని సూచించారు.

    Latest articles

    Student refuses Governor | గవర్నర్​ నుంచి డిగ్రీ పట్టా తీసుకునేందుకు నిరాకరించిన విద్యార్థిని

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Student refuses Governor : ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని అనూహ్యంగా ప్రవర్తించింది. స్నాతకోత్సవం(convocation)లో ముఖ్య అతిథి...

    America | అమెరికాలో ఇండియన్లకు కొత్త సమస్యలు.. గడువుకు ముందే బహిష్కరణ నోటీసులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: America : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తిరిగి అధికారంలోకి...

    Indiramma house | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​.. గృహ ప్రవేశాలపై సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Indiramma house : రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని...

    Girlfriend turns thief | ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Girlfriend turns thief | ఇటీవల వక్ర ప్రేమ కథలు ఎక్కవగా ప్రచారం అవుతున్నాయి. ప్రియుడి...

    More like this