అక్షరటుడే, బోధన్: NZB CP | నిజామాబాద్ జిల్లా (Nizamabad district) బోధన్ పట్టణంలో జలాల్బుకారి దర్గా ఉర్సు ఉత్సవాలు (Urs festival) కొనసాగుతున్నాయి. ఇక్కడి ఏర్పాట్లను సోమవారం (ఆగస్టు 11) రాత్రి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Nizamabad Commissioner of Police Sai Chaitanya) పరిశీలించారు. భద్రతా చర్యలను పర్యవేక్షించారు. బందోబస్తును పటిష్టం చేశారు.
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకునేలా చూడాలని బోధన్ ఏసీపీకి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాల్లో ఎలాంటి వదంతులు నమ్మకుండా పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. ఆయన వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ వెంకటనారాయణ ఉన్నారు.