అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును (BJP State President Ramchandra Rao) సోమవారం (ఆగస్టు 11) పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP Nizamabad District President Dinesh Kulachari) మర్యాదపూర్వకంగా కలిశారు.
BJP : క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి..
ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యకలాపాలపై ఇరువురు చర్చించారు. జిల్లా కమిటీ బలోపేతం, బూత్ స్థాయి వరకు పార్టీ విస్తరణ, ప్రతి గ్రామంలో కార్యకర్తల నెట్వర్క్ నిర్మాణం, యువతలో జాతీయవాద భావజాలాన్ని పెంపొందించడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేర్చడం, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయ చర్యలు, స్థానిక సంస్థల నిర్మాణం వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు.
‘ప్రతి బూత్ – బీజేపీ బూత్’ చేయడమే లక్ష్యంగా పని చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పినట్లు దినేష్ తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, పార్టీ జెండాను గ్రామం నుంచి పట్టణం, జిల్లా వరకు ఎగురవేయాలని రాష్ట్ర అధ్యక్షులు సూచించినట్లు దినేష్ కులాచారి పేర్కొన్నారు.