అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతాల్లోని (Delhi-NCR areas) దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎన్సీఆర్ – ఢిల్లీ ప్రాంతాల్లోని రోడ్లపై ఉన్న కుక్కలను వెంటనే తరలించాలని స్థానిక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Supreme Court : వీధి కుక్కలతో ప్రమాదాలు..
ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) National Capital Region లో తిరిగే వీధి కుక్కలను వెంటనే శరణాలయాలకు (షెల్టర్స్) తరలించాలంటూ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. కుక్కల వల్ల ప్రజలకు భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని కోర్టులో పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
రోడ్డుపై తిరుగుతున్న వీధి కుక్కల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషన్లు వాదించారు. వీటి వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. తరచూ కుక్కల దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని వాపోయారు. ఈ విషయంలో స్థానిక మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కలను తక్షణం తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.