అక్షరటుడే, అమరావతి : AP Mega DSC Results : ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ-2025 ఫలితాలను సర్కారు విడుదల చేసింది. ఈ డీఎస్సీ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం ఏపీ సర్కారు మెగా డీఎస్సీ నిర్వహించింది. దీని ఫలితాలను తాజాగా విడుదల చేసింది.
AP Mega DSC Results : ఇచ్చిన హామీ మేరకు..
తాము అధికారంలోకి వస్తే భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం హామీ నిలబెట్టుకుంది. ఈ మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ (AP Mega DSC) ప్రకటించింది. ఆయా పోస్టులకు మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే నెలలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. ఇక తాజాగా ఫలితాలను కూడా ప్రకటించింది.