అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | రాష్ట్ర సమాచార కమిషనర్లు మంగళవారం జిల్లా కేంద్రానికి రానున్నారని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, కమిషనర్లు కలెక్టరేట్లో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్ జి.చంద్రశేఖర్ రెడ్డి (Commissioner G. Chandrasekhar Reddy), రాష్ట్ర సమాచార కమిషనర్లు శ్రీనివాసరావు, మోహిసిన పర్వీన్, దేశాల భూపాల్, అయోధ్య రెడ్డి, వైష్ణవి మేర్ల ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ చేరుకొని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులతో సమావేశమవుతారని తెలిపారు.
ఆర్టీఐ కేసుల (RTI cases) గురించి ప్రొజెక్టర్ ద్వారా వివరిస్తారని తెలిపారు. ఆ తర్వాత ఆర్టీఐ ఫిర్యాదులపై సంబంధిత పిఐఓలతో హియరింగ్ నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి హోం, అటవీశాఖకు సంబందించిన కేసులు, కమిషనర్లు శ్రీనివాస్ రావు వ్యవసాయం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, మెహసీన్ పర్వీన్ రెవెన్యూ, ట్రైబల్ వెల్ఫేర్, దేశాల భూపాల్ రెవెన్యూ, అయోధ్య రెడ్డి రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కేసులపై విచారణ జరపనున్నట్లు సమాచారం. కమిషనర్ల రాక నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.