అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nidhhi Agerwal | తెలుగు, తమిళ చిత్రాల్లో తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ‘ఇస్మార్ట్ శంకర్’, ‘మిస్టర్ మజ్ను’, ‘సవ్యసాచి’ వంటి చిత్రాలతో యూత్‌ను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఓ విషయంలో ట్రోలింగ్‌కు గురవుతోంది.
సోషల్ మీడియాలో (Social Media) ప్రస్తుతం నిధి అగర్వాల్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె ఏపీ ప్రభుత్వానికి చెందిన వాహనంలో షాపింగ్ మాల్‌కు వెళ్తూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. “ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వ వాహనాలు ఇలా సెలబ్రిటీల కోసం వాడతారా?” అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Nidhhi Agerwal | ఇరకాటంలో నిధి
ఈ ఘటనపై సామాన్య ప్రజలతో పాటు పోలిటికల్ కౌంటర్లు కూడా పెరుగుతున్నాయి. నిధికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ కొంతమంది “ నిధి అగర్వాల్ మాల్స్‌కి గవర్నమెంట్ వాహనంలో (Governement vehicle) వెళ్తోంది” అంటూ ట్వీట్లు పెడుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలు “మా ఏపీలో ఇంతే సార్.. ఇది సాధారణమే” అంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమెకు ప్రభుత్వ వాహనాలు కేటాయించారని కొందరు ఆరోపిస్తున్నారు. అప్పటినుంచే దీనిపై విమర్శలు వస్తున్నా ఇప్పుడు తాజా వీడియోతో మళ్లీ చర్చనీయాంశం అయింది.
ఇటీవల పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ నటించిన ‘హరిహర వీరమల్లు’ భారీ అంచనాల మధ్య విడుదలై వైఫల్యం చవిచూసింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనీస వసూళ్లను కూడా సాధించకపోవడంతో నిధి కెరీర్ మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఆమె ప్రభుత్వ వాహన వాడకంపై వస్తున్న విమర్శలు, రాజకీయ సెటైర్లు ఆమెకు మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో జనసేన (Janasena) సోషల్ మీడియా విభాగం వివరణ ఇచ్చింది. అనవసర విషయాలపై దృష్టి పెడితే కనీసం 12 సీట్లు కూడా రావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అది ప్రైవేట్ వాహనం అని, ప్రభుత్వంది కాదని క్లారిటీ ఇచ్చింది. అనవసర విషయాలపై పేటీఎం బ్యాచ్ దృష్టి పెడుతుందని మండిపడింది. అయితే దీనిపై నిధి ఇంకా స్పందించలేదు.