అక్షరటుడే, ఇందూరు: National level athletics | రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ (athletics) పోటీల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ జిల్లా క్రీడాకారులు రాణించాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ (Nizamabad athletics association) జిల్లా అధ్యక్షుడు నరాల రత్నాకర్ అన్నారు. రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో (R&B Guest house) సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు పతకాలు సాధిస్తున్నారంటే కోచ్ రాజాగౌడ్ కృషి ఎంతగానో ఉందన్నారు. నిజామాబాద్‌లో అతి త్వరలో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్‌ను (Synthetic athletics track) ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరింత ముందుకు వచ్చి అథ్లెటిక్స్ను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, ఉపాధ్యక్షుడు కపిల్ పవర్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
National level athletics | రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించింది వీరే..
- అండర్ 20 జావెలిన్ త్రో లో షేక్ సోహెల్ కాంస్య పతకం, షార్ట్ పుట్లో గాయత్రి కాంస్య పతకం.
- అండర్ 18 జావెలిన్ త్రోలో జైపాల్ బంగారు, శివరాజ్ కాంస్యం.
- లాంగ్ జంప్ లో ప్రణయ్ కాంస్య పతకం.
- అండర్ 16 జావెలిన్ త్రోలో ఉజ్వల, షేక్ అబ్దుల్ కపూర్ కాంస్య పతకం.
- అండర్ టెన్ బాలుర 60 మీటర్ల విభాగంలో జిస్సన్ రజతం పతకం సాధించారు.