ePaper
More
    HomeతెలంగాణPrajavani | ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలి : కలెక్టర్​

    Prajavani | ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలి : కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. ప్రధానంగా కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించవద్దని ఉన్నతాధికారులే హాజరుకావాలని స్పష్టం చేశారు. అయితే సోమవారం నిర్వహించిన ప్రజావాణికి (Prajavani) పలు శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. కొందరు కిందిస్థాయి అధికారులను పంపించారు.

    ఇది గమనించిన కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు (district officials) గైర్హాజరు కావడం సమంజసం కాదన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తప్పకుండా ఉండాలని ఆదేశించారు. ఎవరికైనా అత్యవసర పని ఉంటే ముందుగానే తమ దృష్టికి తేవాలని సూచించారు. అనుమతి లేకుండా ప్రజావాణికి గైరాహాజరయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    Prajavani | ఇకపై అటెండెన్స్..

    ప్రజావాణికి ఆయా శాఖల ఉన్నతాధికారులు గైర్హాజరు కావడంతో కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి ప్రజావాణికి అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. కాగా.. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 83 వినతులు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ (Additional Collector Ankit Kiran Kumar), ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, డీఆర్డీవో సాయా గౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాసరావు, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    PM Modi | ప్రధాని మోదీకి ఉక్రెయిన్​ అధ్యక్షుడి ఫోన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాని నరేంద్ర మోదీకి ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ (Ukrainian President...

    Rythu Bima | రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Rythu Bima | రైతుబీమా (Rythu Bima) కోసం అర్హులైన రైతులు (Farmers) దరఖాస్తు...

    Yellareddy | రేపు విద్యుత్‌ వినియోగదారుల పరిష్కార వేదిక

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని వీకేవీ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక...

    Hydraa | హైడ్రాలో ఎవ‌రి జీతాలు త‌గ్గ‌వు.. మార్షల్స్​కు హామీ ఇచ్చిన కమిషనర్​ రంగనాథ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైడ్రాలో ప‌ని చేస్తున్న సిబ్బంది జీతాలు త‌గ్గ‌వ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌...

    More like this