అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ind-Pak | పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ (Pakistan Army Chief Munir) వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అమెరికా పర్యటనలో ఉన్న మునీర్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌తో (Operation Sindoor) బుద్ధి చెప్పినా.. తీరు మార్చుకోకుండా మరోసారి అణ్వాయుధాల పేరిట బెదిరింపులకు దిగాడు.
అమెరికా నుంచి అసీం మునీర్ ప్రేలాపనలు సిగ్గుచేటని విదేశాంగ శాఖ పేర్కొంది. అణుదాడి (Nuclear attack) చేస్తామన్న వ్యాఖ్యలను కేంద్రం ప్రభుత్వం (Central Government) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని పేర్కొంది. అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా భారత్‌పై రెచ్చిపోవడం పాక్ ఆర్మీకి (Pakistan Army) అలవాటుగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Ind-Pak | అణ్వాయుధాలతో దాడి చేస్తాం
అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ తమకు ముప్పు ఏర్పడినప్పుడు అణ్వాయుధాలు (nuclear weapons) ప్రయోగిస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాము నాశనమవుతుంటే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని పేర్కొన్నారు. అంతేగాకుండా సిందూ నదిపై డ్యామ్ కడితే కూల్చివేస్తామని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత భారత్ పాకిస్తాన్‌కు సిందు జలాలను ఆపేసిన విషయం తెలిసిందే. దీంతో నదిపై ఆనకట్ట కడితే క్షిపణులతో పేల్చి వేస్తామని మునీర్ పేర్కొన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.