అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Sridhar Babu | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపినా.. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ (Odinance) తీసుకు రావాలని గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అయితే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో స్థానిక ఎన్నికల్లో (Local Body Elections) రిజర్వేషన్‌పై అయోమయం నెలకొంది. ఈ క్రమంలో తాజాగా మంత్రి శ్రీధర్‌బాబు బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.
కరీంనగర్‌లో (Karimnagar) సుడా కార్యాలయ భవన నిర్మాణానికి సోమవారం మంత్రి శ్రీధర్‌బాబు భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి (BJP) చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బిల్లులను ఆమోదించని ప్రభుత్వం.. ఆర్డినెన్స్‌ను కూడా ఆపుతోందని విమర్శించారు. బీసీలకు అభ్యున్నతికి త పార్టీ కట్టుబడి ఉందని.. 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Minister Sridhar Babu | అనర్హతపై స్పీకర్‌దే నిర్ణయం
బీఆర్ఎస్ (BRS) నుంచి గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌దే తుది నిర్ణయమని మంత్రి స్పష్టం చేశారు. మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) ప్రకటించిన విషయం తెలిసిందే. అనర్హత విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. అలాగే కాళేశ్వరం నివేదికపై ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు. మేడిగడ్డ లాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెడతామన్నారు.