అక్షరటుడే, భీమ్గల్: Midday meal | పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం (nutritious food) అందించేందుకు రూ. వందల కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యార్థుల్లో పోషకాహార లోపం రాకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని (midday meal scheme) కొనసాగిస్తోంది. కాగా.. పథకం సక్రమంగా అమలవుతుందా లేదా అని అధికారులు పర్యవేక్షిస్తుంటారు.
ఇందులో భాగంగా వేల్పూర్ మండలంలోని (Velpur mandal) పచ్చల నడ్కుడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీవో సాయిలు సోమవారం తనిఖీ చేశారు. పాఠవాలలో వంట సామాగ్రి, వంటగది, కూరగాయలను ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులున్నారు.