ePaper
More
    HomeజాతీయంVote Chori | ఢిల్లీలో విపక్ష ఎంపీల ఆందోళన.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

    Vote Chori | ఢిల్లీలో విపక్ష ఎంపీల ఆందోళన.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vote Chori | ఢిల్లీ (Delhi)లో విపక్ష ఎంపీలు సోమవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. బీహార్​ (Bihar)లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(SIR)కు వ్యతిరేకంగా, ఓటు చోరీ అంశంపై విపక్ష ఎంపీలు పార్లమెంట్ (Parliament) నుంచి మార్చ్ నిర్వహించారు. 2024 పార్లమెంట్​ ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.

    ఓటు చోరీ, బీహార్​లో ఎన్నికల జాబితా సవరణను నిరసిస్తూ ఇండియా (INDIA) కూటమితో పాటు విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన నిర్వహించారు. ఇందులో భాగంగా పార్లమెంట్​ నుంచి ఎన్నికల సంఘం (Election Commission) కార్యాలయం వరకు మార్చ్​ తలపెట్టారు. 25 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 300 మందికి పైగా లోక్​సభ, రాజ్యసభ ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. అయితే విపక్ష ఎంపీల మార్చ్​ను పోలీసులు అడ్డుకున్నారు.

    Vote Chori | అనుమతి లేదని..

    విపక్ష ఎంపీల మార్చ్‌ను అడ్డుకున్న పోలీసులు.. ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. సంసద్‌ మార్గ్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ఎంపీలు మార్చ్​ సాగే మార్గంలో బారీకేడ్లు ఏర్పాటు చేసి రోడ్డును బ్లాక్​ చేశారు. అయితే పలువురు ఎంపీలు బారికేడ్లపైకి ఎక్కడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మార్చ్​లో పాల్గొన్న రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు విపక్ష ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

    Vote Chori | రాహుల్​ గాంధీ ఆధ్వర్యంలో..

    రాహుల్​ గాంధీ ఆధ్వర్యంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు మార్చ్​ నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు పార్లమెంట్​ నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు విపక్ష ఎంపీలు ఈసీని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి అపాయింట్​మెంట్​ తీసుకున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాజ్​వాది పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్​ యాదవ్​ (Akhilesh Yadav) బారీకేడ్లపై ఎక్కి దూకడానికి యత్నించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే, ఆప్​, వామపక్ష పార్టీలు, ఆర్జేడీ, ఎన్​సీపీ (SP), శివసేన (UBT), నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీలు పాల్గొన్నాయి. పోలీసులు తమను అడ్డుకోవడం సమాజ్​వాద్ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వీధుల్లో నడవడానికి ఎంపీలకు పోలీసుల అనుమతి అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా 30 ఎంపీలకు మాత్రమే తమను కలవడానికి అపాయింట్​మెంట్​ ఇచ్చినట్లు ఈసీ తెలిపింది.

    Latest articles

    Teej festival | ఘనంగా తీజ్ వేడుకలు.. ఆకట్టుకున్న యువతుల నృత్యాలు

    అక్షరటుడే, డిచ్​పల్లి: Teej festival | గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక నిలిచే పండుగ తీజ్​. ప్రకృతి ఆరాధకులైన...

    Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 22 ఫిర్యాదులు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Prajavani | నిజామాబాద్​ కమిషనరేట్​లో సోమవారం నిర్వహించిన పోలీస్​ ప్రజావాణికి 22 ఫిర్యాదులు...

    Kamareddy Collector |నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు వేయాలి: కలెక్టర్​

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | నులిపురుగుల నివారణకు ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వయసున్న ప్రతిఒక్కరికి అల్బెండజోల్...

    Balkonda SI | ఈవ్​టీజింగ్ చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, భీమ్​గల్: Balkonda SI | ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని బాల్కొండ ఎస్సై శైలేందర్...

    More like this