అక్షరటుడే, బోధన్: Bodhan Town | పట్టణంలోని రెంజల్ బేస్‌లో (Renjal Base) గల హజ్రత్ సయ్యద్ షా జలాల్ బుఖారి రహమతుల్లా అలై దర్గా ఉర్సు వేడుకలు (Urs celebrations) ప్రారంభమయ్యాయి. ఉర్సు సందర్భంగా మూడు రోజులపాటు పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. దర్గా ముతవల్లి అబ్దుల్ ముక్తాదార్ సజ్జాద్ నివాసం నుండి భక్తులు ఆదివారం రాత్రి గంధంను ఒంటెపై తీసుకొని వేకువ జామున దర్గాకు చేరుకున్నారు.
గంధంతో ప్రారంభమైన ఊరేగింపు రెంజల్ బేస్ ప్రాంతంలోని (Renjal Base area) ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ప్రజలు పెద్ద ఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు. సోమవారం రాత్రి జరిగే ప్రత్యేక ఖవ్వాలి కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో ఉర్సు కమిటీ అధ్యక్షుడు ఖాజా షరీఫ్ ఉద్దీన్, ఎంఐఎం అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీలతో పాటు పట్టణ ప్రముఖులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.