అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar SI | నిజాంసాగర్ (Nizamsagar), మహమ్మద్ నగర్ మండలాల్లోని (Mohammed Nagar mandal) పలు దాబాలపై పోలీసులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం సిట్టింగులను ఏర్పాటు చేస్తుండడంతో నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ (Nizamsagar SI Shivakumar) ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. మాగి గేటు వద్ద గల మాగీ గ్రిల్స్, బేడీల మైసమ్మ దాబా, మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గేటు వద్ద గల భవాని దాబాలలో దాలు చేశారు. ఈ సందర్భంగా మద్యం సిట్టింగ్లకు అనుమతి ఇస్తున్న పలు దాబాల నిర్వాహలకులపై నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
