అక్షరటుడే, వెబ్‌డెస్క్: Noida | నోయిడాలోని ఓ ప్రైవేట్ డే కేర్ (Day Care) సెంటర్‌లో దారుణం జరిగింది. అక్కడ 15 నెలల పసిపాపపై పనిమనిషి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆగస్టు 4న చోటుచేసుకున్నట్లు సమాచారం. సీసీటీవీలో ఈ దాడి ఘటన రికార్డయ్యింది. డే కేర్ సెంటర్ (day care center) నుంచి ఇంటికి తీసుకువచ్చిన అనంతరం చిన్నారిని తల్లి గమనించింది. ఏడవడం, ఎంత ఓదార్చిన కూడా ఆపకపోవడం, మరోవైపు బట్టలు మార్చే సమయంలో బాలిక రెండు కాళ్లపై భాగంలో వృత్తాకార గాయాల మచ్చలు కనిపించాయి.
Noida | చిన్నారి అని చూడకుండా..
చిన్నారి తీవ్రంగా కొట్టడంతో అప్రమత్తమైన తల్లి వెంటనే బాలికను డాక్టర్ (Doctor) వద్దకు తీసుకెళ్లింది. వైద్యుడు పరిశీలించి ఆ గాయాలు మనిషి కొట్టిన గాయాల మాదిరిగా ఉన్నాయని తెలిపారు. వెంటనే తల్లిదండ్రులు డే కేర్ సీసీటీవీ ఫుటేజ్‌ను (CCTV footage) పరిశీలించగా ఆ చిన్నారిపై పనిమనిషి హింసాత్మకంగా ప్రవర్తించిన దృశ్యాలు కనిపించాయి.
పాపని లాలించకుండా క్రూర మృగంలా ప్రవర్తించడంతో ఆ చిన్నారి భయంతో ఏడుస్తూనే ఉంది. ఫుటేజ్‌లో కనిపించిందేమిటంటే.. ఏడుస్తున్న చిన్నారిని పనిమనిషి మొదట శాంతింపజేయాలని ప్రయత్నించింది. కానీ బాలిక ఏడుపు ఆపకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తూ, చిన్నారిని నేలపై పడేసింది. గది తలుపు మూసి, ఆమెను చెంపదెబ్బ కొట్టింది. అంతేగాక, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొట్టిన దృశ్యాలూ వీడియోలో కనిపించాయి.
ఇక ఇదే సమయంలో డే కేర్ నిర్వహణలో ఉన్న వారు ఈ దృశ్యాలను గమనించినప్పటికీ ఏ మాత్రం స్పందించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పైగా, వారిని నిలదీయగా, నిర్వాహకురాలు, పనిమనిషి కలిసి దురుసుగా ప్రవర్తించారని, బెదిరించారంటూ తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చిన్నారికి వైద్య పరీక్షలు (medical examination) నిర్వహించి, నిందితురాలైన పనిమనిషిని అరెస్టు చేశారు. ఈ సంఘటన చిన్నారుల భద్రతపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది. డే కేర్ సెంటర్లలో పర్యవేక్షణ, బాధ్యత అంశాల్లో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అత్యంత కీలకంగా మారింది.
पारस टेरा सोसाइटी नोएडा में नियमों को ताक पर रख कर संचालित ब्लीपी डे केअर की नाबालिक (16वर्ष)सहायिका द्वारा 15 माह की बच्ची (वेदांसी) के साथ मार पीट व मुह से काट कर घायल कर दिया गया
कृपया संज्ञान लें🙏 pic.twitter.com/MsQRMIM6uw— kuldeep (@Kuldeep44816379) August 10, 2025