ePaper
More
    Homeబిజినెస్​Stock Markets | కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు.. లాభాల బాట పట్టిన సూచీలు

    Stock Markets | కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు.. లాభాల బాట పట్టిన సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Markets | గ్లోబల్‌ మార్కెట్లు సానుకూలంగా ఉండడం, కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుండడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికవరీ దిశగా సాగుతున్నాయి. ఐసీఐసీఐ మినహా మిగతా బ్యాంకింగ్‌ స్టాక్స్‌ సూచీలను ముందుకు తీసుకువెళ్తున్నాయి.

    సోమవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 28 పాయింట్లు, నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమయ్యాయి. తొలి గంటపాటు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 79,772 పాయింట్ల కనిష్టానికి, నిఫ్టీ(Nifty) 24,347 పాయింట్ల కనిష్టానికి పడిపోయాయి. ఆ తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో తేరుకుని లాభాలబాటపట్టాయి. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 181 పాయింట్ల లాభంతో 80,039 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 24,420 వద్ద కొనసాగుతున్నాయి.

    Stock Markets | పీఎస్‌యూ స్టాక్స్‌లో ర్యాలీ..

    పీఎస్‌యూ బ్యాంక్‌(PSU Bank), పీఎస్‌యూ స్టాక్స్‌ ర్యాలీ తీస్తున్నాయి. ఇన్‌ఫ్రా, పవర్‌ తదితర రంగాల స్టాక్స్‌లోనూ కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.54 శాతం పెరగ్గా.. రియాలిటీ, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌లు 0.92 శాతం, పీఎస్‌యూ 0.83 శాతం, పవర్‌ 0.78 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.76 శాతం, బ్యాంకెక్స్‌ 0.68 శాతం, హెల్త్‌కేర్‌ 0.58 శాతం, ఆటో ఇండెక్స్‌ 0.53 శాతం పెరిగాయి. కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ ఇండెక్స్‌ 0.55 శాతం, ఆయిల్‌ అండ్‌ 0.26 శాతం, ఎనర్జీ ఇండెక్స్‌ 0.17 శాతం నష్టంతో ఉన్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ (Large cap index) 0.47 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.44 శాతం లాభాలతో ఉండగా.. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.04 శాతం నష్టంతో కొనసాగుతోంది.

    Stock Markets | Top gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 23 కంపెనీలు లాభాలతో ఉండగా.. 7 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటా మోటార్స్‌ 2.76 శాతం, ట్రెంట్‌ 2.22 శాతం, ఎస్‌బీఐ 2.10 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.33 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 1.03 శాతం లాభాలతో ఉన్నాయి.

    Stock Markets | Top losers..

    ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.77 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.58 శాతం, మారుతి 0.41 శాతం, ఎయిర్‌టెల్‌ 0.25 శాతం, టాటా స్టీల్‌ 0.19 శాతం నష్టాలతో ఉన్నాయి.

    Latest articles

    Teej festival | ఘనంగా తీజ్ వేడుకలు.. ఆకట్టుకున్న యువతుల నృత్యాలు

    అక్షరటుడే, డిచ్​పల్లి: Teej festival | గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక నిలిచే పండుగ తీజ్​. ప్రకృతి ఆరాధకులైన...

    Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 22 ఫిర్యాదులు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Prajavani | నిజామాబాద్​ కమిషనరేట్​లో సోమవారం నిర్వహించిన పోలీస్​ ప్రజావాణికి 22 ఫిర్యాదులు...

    Kamareddy Collector |నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు వేయాలి: కలెక్టర్​

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | నులిపురుగుల నివారణకు ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వయసున్న ప్రతిఒక్కరికి అల్బెండజోల్...

    Balkonda SI | ఈవ్​టీజింగ్ చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, భీమ్​గల్: Balkonda SI | ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని బాల్కొండ ఎస్సై శైలేందర్...

    More like this