ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Hydraa | విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్​.. నిలిచిపోయిన అత్యవసర సేవలు

    Hydraa | విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్​.. నిలిచిపోయిన అత్యవసర సేవలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైడ్రాలో విధులు నిర్వర్తిస్తున్న మార్షల్స్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఆక్రమణలు తొలగించడానికి ప్రభుత్వం హైడ్రా (Hydraa)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా వర్షాలతో ముంపు ఉన్న ప్రాంతాల్లో హైడ్రా సిబ్బంది అత్యవసర సేవలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా హైడ్రాలో మాజీ సైనికులను మార్షల్స్​గా నియమించారు. అయితే వారి జీతాలను ఇటీవల హైడ్రా తగ్గించింది. దీంతో విధులు బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు.

    Hydraa | ఆపరేషన్​ మాన్సూన్​పై ప్రభావం

    వర్షాల నేపథ్యంలో నగరంలో హైడ్రా ఆపరేషన్​ మాన్సూన్​ (Operation Mansoon) కార్యక్రమం చేపట్టింది. అయితే మార్షల్స్ (Marshals) విధుల బహిష్కరించడంతో ఈ ఆపరేషన్‌పై ప్రభావం పడింది. హైడ్రా కంట్రోల్‌ రూమ్‌ సేవలకు అంతరాయం కలిగింది. ట్రైనింగ్‌ కార్యక్రమం, ప్రజావాణి సేవలు నిలిచిపోయాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో సేవలు బంద్​ అయ్యాయి. 51 హైడ్రా భారీ వాహనాల సేవలు, ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

    Hydraa | 90 మంది మాజీ సైనికులు

    నగరంలో వర్షాకాల సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి హైడ్రాలో సైనిక సిబ్బందిని నియమించారు. ఐదు నెలల పాటు 90 మాజీ సైనికులను ‘మార్షల్స్’గా హైడ్రా నియమించింది. వీరు నగరంలోని ఎమర్జెన్సీ టీమ్​లను నడిపిస్తారు. అంతేగాకుండా చెరువుల రక్షణకు చర్యలు చేపడతారు. మార్షల్స్​ కాంట్రాక్టర్ల కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. బిల్లుల చెల్లింపునకు ముందు కాంట్రాక్టర్లు వరద ముంపు సమస్యలను పరిష్కరించారా, పడిపోయిన చెట్లను తొలగించారా అని మార్షల్స్​ పరిశీలిస్తారు. ప్రస్తుతం వీరు విధులు బహిష్కరించడంతో ఆయా సేవలు నిలిచిపోయాయి. దీంతో భారీ వర్షం పడితే నగరవాసులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

    Latest articles

    Teej festival | ఘనంగా తీజ్ వేడుకలు.. ఆకట్టుకున్న యువతుల నృత్యాలు

    అక్షరటుడే, డిచ్​పల్లి: Teej festival | గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక నిలిచే పండుగ తీజ్​. ప్రకృతి ఆరాధకులైన...

    Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 22 ఫిర్యాదులు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Prajavani | నిజామాబాద్​ కమిషనరేట్​లో సోమవారం నిర్వహించిన పోలీస్​ ప్రజావాణికి 22 ఫిర్యాదులు...

    Kamareddy Collector |నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు వేయాలి: కలెక్టర్​

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | నులిపురుగుల నివారణకు ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వయసున్న ప్రతిఒక్కరికి అల్బెండజోల్...

    Balkonda SI | ఈవ్​టీజింగ్ చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, భీమ్​గల్: Balkonda SI | ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని బాల్కొండ ఎస్సై శైలేందర్...

    More like this