అక్షరటుడే, వెబ్‌డెస్క్: MP Sanjay Raut | ఉప రాష్ట్రపతి పదవి నుంచి అనూహ్యంగా తప్పుకున్న జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) ఆ తర్వాత నుంచి బయట ప్రపంచానికి కనిపించలేదు. అనారోగ్య కారణలతో జూలై 21వ తేదీన ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఎవరికీ అందుబాటులోకి రాలేదు. ఆయన రాజీనామాపై అనుమానాలు వ్యక్తం చేసిన విపక్షాలు.. ఇప్పుడు ఆయన ఆచూకీ లేదని ఆందోళన చెందుతున్నాయి.
ఈ తరుణంలో ధన్‌ఖడ్ ఎక్కడ ఉన్నారు, ఆయన ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Shiv Sena MP Sanjay Raut) కేంద్ర హోంమంత్రి అమిత్ (Union Home Minister Amit Shah) షాకు లేఖ రాశారు. ఈ మేరకు ఆయన సోమవారం సోషల్ మీడియాలో (Social media) తన లేఖను షేర్ చేశారు. ధన్‌ఖడ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన గురించి ఎటువంటి సమాచారం లేదని రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన భద్రతపై నిజమైన సమాచారం అందించాలని హోంమంత్రిని కోరారు.
MP Sanjay Raut | షాకింగ్ నిర్ణయం..
జూలై 21న ఉదయం రాజ్యసభ సమావేశానికి (Rajya Sabha session) అధ్యక్షత వహిస్తున్నప్పుడు ధన్‌ఖడ్ సాధారణంగా కనిపించారని, సభ వాయిదా వేసే ముందు ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేతో (Mallikarjun Kharge) మాట్లాడారని రౌత్ గుర్తు చేశారు. అయితే, అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆయన రాజీనామా చేయడాన్ని రౌత్ “షాకింగ్”గా అభివర్ణించారు. “జూలై 21 నుంచి నేటి వరకు మన ధన్‌ఖడ్ ఎక్కడ ఉన్నాడనే దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు.? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఈ విషయాలపై స్పష్టత లేదని” రౌత్ పేర్కొన్నారు.
MP Sanjay Raut | కోర్టులో పిటిషన్ వేయాలని..
ధన్‌ఖడ్‌ను సంప్రదించడానికి రాజ్యసభ సభ్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని రౌత్ తెలిపారు. మాజీ ఉపాధ్యక్షుడిని తన నివాసానికే పరిమితం చేశారని ఢిల్లీలో పుకార్లు వ్యాపించాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆచూకీ కోసం కోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. “సుప్రీంకోర్టులో (Supreme Court) హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని అనుకుంటున్నాం. అంతకు ముందు ముందుగా హోం మంత్రి అమిత్ షాను సంప్రదించాలని నిర్ణయించుకున్నాం. సుప్రీం కోర్టు తలుపులు తట్టే ముందు మీ నుంచి ఈ సమాచారాన్ని కోరడం వివేకవంతమైనదని నేను భావిస్తున్నానని” అని తెలిపారు.