ePaper
More
    HomeతెలంగాణSuryapet | బాలికను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్​.. చర్యలకు సిద్ధమైన అధికారులు

    Suryapet | బాలికను పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్​.. చర్యలకు సిద్ధమైన అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Suryapet | బాల్య వివాహాలు (Child Marriages) చట్టరీత్యా నేరం. చిన్న వయసులో పెళ్లి చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వాలు బాల్య వివాహాలను నిషేధించాయి. 18 ఏళ్లు నిండే వరకు బాలికలకు పెళ్లి చేయొద్దని చట్టం తీసుకొచ్చాయి. ఎవరైనా 18 ఏళ్లలోపు తమ కూతుళ్లకు వివాహాలు చేస్తే అధికారులు, పోలీసులు అడ్డుకుంటారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్​ ఇస్తారు. అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తారు. అయితే ఇక్కడ ఓ పోలీస్​ కానిస్టేబుల్ బాల్య వివాహం చేసుకోవడం గమనార్హం.

    Suryapet | నాలుగు వివాహాలు

    సూర్యాపేట (Suryapet) జిల్లా నడిగూడెం పోలీస్​ స్టేషన్​లో (Nadigudem Police Station)​ కృష్ణంరాజు అనే వ్యక్తి కానిస్టేబుల్​గా పని చేస్తున్నాడు. అయితే ఆయనకు నాలుగు వివాహాలు అయినట్లు.. అందులో మూడో వివాహం బాలికతో జరిగిందని సోషల్​ మీడియాలో (Social Media) ఇటీవల వైరల్​ అయింది. సూర్యాపేట మండలానికి చెందిన బాలికను సదరు కానిస్టేబుల్​ వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరగడంతో ఎస్పీ నరసింహ (SP Narasimha) స్పందించారు. ఈ మేరకు విచారణ చేపట్టాలని మునగాల సీఐ రామకృష్ణారెడ్డిని ఆదేశించారు.

    Suryapet | పరారీలో కానిస్టేబుల్

    కానిస్టేబుల్​ వివాహం చేసుకున్న బాలిక ప్రస్తుతం సూర్యాపేటలో నివాసం ఉంటుంది. సీఐ రామకృష్ణారెడ్డిని ఆదివారం బాలిక ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. చివ్వెంల మండలానికి చెందిన కృష్ణంరాజుపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఇసుక వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేశాడని గతంలో ఓ సారి సస్పెండ్​ కూడా చేశారు. తర్వాత నడిగూడెం ఠాణాలో నియమించగా.. డిప్యూటేషన్​పై సూర్యాపేట కలెక్టరేట్‌లో పని చేస్తున్నాడు. బాలికను పెళ్లి చేసుకున్న విషయం సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో కృష్ణంరాజు పరారీలో ఉన్నాడు. సదరు కానిస్టేబుల్​పై ఉన్నతాధికారులు పోక్సో కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం.

    కాగా.. బాల్య వివాహాలను అరికట్టాల్సిన కానిస్టేబుల్​ బాలికను వివాహం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

    Latest articles

    Balkonda SI | ఈవ్​టీజింగ్ చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, భీమ్​గల్: Balkonda SI | ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని బాల్కొండ ఎస్సై శైలేందర్...

    Kamareddy | గీత వృత్తి రక్షణ కోసం ఉద్యమానికి సిద్ధమవుదాం

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అమరుల స్ఫూర్తితో కల్లు గీత వృత్తి రక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధమవుదామని కల్లుగీత...

    MLA Lakshmi Kantharao | విద్యార్థులపై ఖర్చుచేసే ప్రతి పైసా బంగారు తెలంగాణకు పెట్టుబడి

    అక్షరటుడే, నిజాంసాగర్: MLA Lakshmi Kantharao | విద్యార్థుల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి బంగారు...

    Nizamsagar project | నిజాంసాగర్​లోకి పెరిగిన ఇన్​ఫ్లో

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar project | నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన వర్షాలకు జలాశయంలోకి వరద పెరిగింది....

    More like this