ePaper
More
    HomeజాతీయంTamil Nadu | హాస్ట‌ల్‌లో త‌న ల‌వ‌ర్‌కు పుట్టిన బిడ్డ‌.. సంచిలో తీసుకెళ్లి ఆస్పత్రిలో అప్ప‌గించిన...

    Tamil Nadu | హాస్ట‌ల్‌లో త‌న ల‌వ‌ర్‌కు పుట్టిన బిడ్డ‌.. సంచిలో తీసుకెళ్లి ఆస్పత్రిలో అప్ప‌గించిన ప్రియుడు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu | తమిళనాడు రాజధాని చెన్నైలో (Chennai) ఓ యువకుడి ప్రవర్తన మొద‌ట మానవత్వానికి నిదర్శనంగా అనిపించిన‌, పోలీసుల విచారణ (police investigation) తర్వాత సంచలన నిజాలు వెలుగు చూడ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవాల్సి వ‌చ్చింది. మేట‌ర్‌లోకి వెళితే చెన్నై ప‌రిధిలోని ట్రిప్లికేన్‌లో ఉన్న ఓమందూరార్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి (Omandurar Government Hospital) ఓ యువ‌కుడు పుట్టి ఒక్క‌రోజే అయిన శిశువును సంచిలో వేసుకొని తీసుకొని వ‌చ్చాడు. ఆ బిడ్డ త‌న‌కి రోడ్డుపై దొరికినట్టు చెప్పాడు. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు యువకుడి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసి అతన్ని ప్రశ్నించారు.

    Tamil Nadu | లోతైన విచార‌ణ‌లో..

    పోలీసులు ప్ర‌శ్నించిన సందర్భంలో యువకుడు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణలో యువకుడు తాను ఊటీకి చెందినవాడినని, పేరు ప్రదీప్ (Pradeep) అని వెల్లడించాడు. ప్రస్తుతం గ్రూప్-1 పరీక్ష కోసం చెన్నైలోని హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నట్లు తెలిపాడు. చెన్నైలోని గిండి యూనివర్సిటీ హాస్టల్‌లో (Guindy University hostel) ఎంఎస్‌సీ చదువుతున్న ఓ యువతితో ప్రేమలో పడ్డ‌ట్టు తెలిపాడు. వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఫలితంగా యువతి గర్భవతి కావడం, హాస్టల్‌లోనే బిడ్డను ప్రసవించడం జరిగిందని తెలియ‌జేశాడు. తాము చేసిన త‌ప్పు వ‌ల‌న పుట్టిన బిడ్డ‌ని ఏం చేయాలో తెలియ‌క‌, తాను బిడ్డను ఆసుపత్రికి తీసుకొచ్చానని చెప్పాడు. ఇది విన్న‌వారంతా ఒక్క‌సారి షాక్ అయ్యారు.

    ప్రస్తుతం పోలీసులు యువకుడి వాంగ్మూలం ఆధారంగా కేసును నమోదు చేసి, మరింత దర్యాప్తు చేపట్టారు. బాలల హక్కులు, హాస్టల్ నిబంధనలు, అసలు యువతి పరిస్థితి వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో విద్యార్థుల మధ్య సంబంధాలు, యువతలో లోపించిన అవ‌గాహన ఎలా ఉందో అర్ధ‌మ‌వుతుంది. ఈ విష‌యంపై కొంద‌రు నెటిజ‌న్స్ (Netigens) విచిత్రంగా కామెంట్స్ చేస్తున్నారు. పుట్టిన బిడ్డ‌ని చంపేస్తున్న ఈ రోజుల్లో అత‌డు తీసుకున్న నిర్ణయం కొంత బెట‌ర్ అంటున్నారు..

    Latest articles

    Minimum balance | బ్యాంక్​ ఖాతాల్లో మినిమమ్​ బ్యాలెన్స్​పై ఆర్​బీఐ గవర్నర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Minimum balance | ఖాతాల్లో మినిమమ్​ బ్యాలెన్స్​ లేకపోతే పలు బ్యాంకులు ఫైన్​ వేస్తున్న విషయం...

    Amazon | నీటి పునరుద్ధరణ ప్రాజెక్టుల కోసం పెట్టుబడి పెట్టిన అమెజాన్

    అక్షరటుడే, హైదరాబాద్: Amazon | భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ మరియు పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా...

    MLA Bhupathi Reddy | రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    అక్షరటుడే, ఇందల్వాయి: MLA Bhupathi Reddy | రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్...

    Bodhan mla | కంఠేశ్వర్ ఆలయంలో హాల్​ నిర్మాణానికి కృషి చేస్తా..

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bodhan mla | నగరంలో ప్రసిద్ధిగాంచిన కంఠేశ్వరాలయంలో భక్తుల సౌకర్యార్థం ఖాళీ స్థలంలో హాల్​తో పాటు,...

    More like this