అక్షరటుడే, వెబ్‌డెస్క్: గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో, యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఫ్లాట్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) మాత్రం పాజిటివ్‌గా ఉంది.
Pre Market Analysis : యూఎస్(US Market) మార్కెట్లు..
టెక్నాలజీ షేర్లలో ర్యాలీ కొనసాగుతుండడంతో వాల్‌స్ట్రీట్(Wallstreet) రికార్డులు సృష్టిస్తోంది. నాస్‌డాక్ వరుసగా రెండో సెషన్‌లోనూ రికార్డు స్థాయి గరిష్టాల వద్ద నిలిచింది. నాస్‌డాక్ 0.98 శాతం, ఎస్‌అండ్‌పీ 0.78 శాతం పెరగ్గా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ సైతం 0.32 శాతం లాభంతో కొనసాగుతోంది.
Pre Market Analysis : యూరోప్ మార్కెట్లు(European markets)..
డీఏఎక్స్ 0.12 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.06 శాతం నష్టంతో ముగియగా.. సీఏసీ 0.43 శాతం లాభపడిరది.
Pre Market Analysis : ఆసియా(Asia markets)మార్కెట్లు..
ఆసియా మార్కెట్లు ఫ్లాట్(Flat)గా ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం జపాన్‌లో మౌంటెయిన్ డే సందర్భంగా సెలవు కావడంతో అక్కడి మార్కెట్లు తెరచుకోలేదు. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.11 శాతం, షాంఘై 0.08 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.02 శాతం లాభంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్(Hang Seng) 0.33 శాతం, కోస్పీ 0.02 శాతం, నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.19 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..
ఎఫ్‌ఐఐ(FII)లు 14 వరుస ట్రేడిరగ్ సెషన్‌ల తర్వాత నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నికరంగా రూ. 1,932 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు. డీఐఐలు 25వ ట్రేడిరగ్ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా కొనసాగారు. నికరంగా రూ. 7,723 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.06 నుంచి 0.66కు తగ్గింది. ఇది బేరిష్ మూడ్‌ను సూచిస్తుంది. విక్స్ 2.95 శాతం పెరిగి 12.03కి చేరింది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.39 శాతం తగ్గి 66.33 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 5 పైసలు బలపడి 87.66 వద్ద నిలిచింది.
యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.29 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.09 వద్ద కొనసాగుతున్నాయి. - భారత్, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలు, టారిఫ్‌లు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. అలాగే ఈనెల 15న జరిగే రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin), యూఎస్ అధ్యక్షుడు ట్రంప్(Trump)ల భేటీపైనా ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించే అవకాశాలున్నాయి.